Site icon NTV Telugu

KTR: సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత‌ వ్యాఖ్యలు.. కేటీఆర్పై కేసు నమోదు..

Ktr

Ktr

KTR: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిష్ఠకు భంగం కలిగించేలా అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ బాల్మూరి వెంకట్ ఈ మేరకు పోలీసులకు కంప్లైంట్ చేశారు. సీఎంని కించపరిచేలా, ఆయన ప్రతిష్టను దెబ్బ తీసే ఉద్దేశంతో కేటీఆర్ ఉద్దేశపూర్వకంగానే రెచ్చగొట్టేలా కామెంట్స్ చేశారని తన ఫిర్యాదులో తెలియజేశారు. కేటీఆర్ చేసిన ఆరోపణలు, పరువు నష్టం కలిగించే వ్యాఖ్యలతో కూడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుందని ఎమ్మెల్సీ బాల్మూరి వెంకట్ పేర్కొన్నారు.

Read Also: What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?

అయితే, కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అక్రమాలపై మాజీ సీఎం కేసీఆర్‌ను విచారణ కమిషన్ ప్రశ్నిస్తున్న సమయంలో ఇలాంటి కామెంట్స్ చేయడంతో ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి, ప్రజా శాంతికి భంగం కలిగించే అవకాశం ఉందని ఎమ్మెల్సీ బాల్మూరి వెంకట్ పోలీస్ కంప్లైంట్ లో రాసుకొచ్చాడు. ఇక, ఫిర్యాదు అందుకున్న పోలీసులు.. సాక్ష్యాధారాలను పరిగణలోకి తీసుకుని కేటీఆర్‌పై బీఎన్ఎస్ లోని సెక్షన్ 353(2), సెక్షన్ 352 కింద కేసు నమోదు చేశారు.

Exit mobile version