Bar License Applications: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 24 బార్లు, మిగిలిన జిల్లాల్లోని నాలుగు బార్లకు సంబంధించిన దరఖాస్తులకు భారీ ఆదరణ లభించింది. మొత్తం 28 బార్ల టెండర్ కోసం 3,668 అప్లికేషన్లు వచ్చాయి.
GHMC : జీహెచ్‌ఎంసీ పరిధిలోని 24 బార్లకు మిగిలిన మూడు రోజుల వ్యవధిలో భారీగా దరఖాస్తులు వచ్చే అవకాశం ఉందని రంగారెడ్డి డిప్యూటీ కమిషనర్ పీ. దశరథ్ తెలిపారు. నాంపల్లి కార్యాలయంలో దరఖాస్తుల స్వీకరణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు చెప్పారు. ఇటీవల రూరల్ ప్రాంతాల్లో బార్లకు అనూహ్యంగా అధిక దరఖాస్తులు వచ్చాయని ఆయన తెలిపారు. మొత్తంగా జీహెచ్‌ఎంసీతో కలిపి 28 బార్లకు పునరుద్ధరణ కోసం దరఖాస్తులను ఆహ్వానించినట్లు పేర్కొన్నారు. ఇప్పటివరకు జీహెచ్‌ఎంసీ పరిధిలోని 24 బార్లకు…