Telangana Govt: తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో సింగరేణి కార్మికుల లాభాల వాటా ప్రకటన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరుకాగా.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, వివేక్ వెంకట స్వామి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, శ్రీధర్ బాబు, ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ, హర్కర వేణుగోపాల్, ఎంపీలు రఘురాం రెడ్డి, బలరాం నాయక్, సింగరేణి సీఎండీ బలరాం, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సింగరేణి 2024-25 ఆర్ధిక సంవత్సరంలో సాధించిన లాభాలలో కార్మికులకు వాటాను రాష్ట్ర సర్కార్ ప్రకటించింది.
Read Also: Supreme Court: దురదృష్టకరం.. ఎయిరిండియా ప్రమాద కథనాలపై సుప్రీంకోర్టు వ్యాఖ్య
ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ ఏర్పాటులో సింగరేణి కార్మికుల పాత్ర కీలకం.. సింగరేణి కార్మికుల పోరాటం, కృషిని మా పార్టీ ఎప్పుడూ గుర్తు పెట్టుకుంటుంది.. రాష్ట్ర ఆదాయంలో కీలకంగా ఉన్న కార్మికులకు వాటా పంచుతున్నాం.. సింగరేణి మూత పడుతుంది అనుకున్నప్పుడు.. కాకా వెంకట స్వామి అడ్డుకున్నారు.. సింగరేణి బలోపేతానికి కృషి చేస్తున్నాం.. సింగరేణిలో కాంట్రాక్ట్ కార్మికులకు కూడా బోనస్ ఇస్తున్నాం.. దేశంలో ఎక్కడా కాంట్రాక్ట్ కార్మికులకు బోనస్ ఇవ్వడం లేదు.. కార్పొరేట్ కంపెనీలతో పోటీ పడాలని ఆయన సూచించారు. లాభాలలో కొంత పెట్టుబడులకు పెడుతున్నాం..కార్మికులతో మాట్లాడి.. విస్తరణ ఎలా ఉండాలనే దానిపై భట్టి విక్రమార్క చర్చిస్తారని పేర్కొన్నారు. గత పాలకులు టెండర్లలో పాల్గొనలేమని నిర్ణయం తీసుకుంది.. ఇది తప్పు, కార్మికులతో మాట్లాడి నచ్చచెప్పాం.. ప్రైవేట్ కంపెనీలకు ఇచ్చిన గనులను వెనక్కి తీసుకోవడానికి కూడా ఆలోచిస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ వెల్లడించారు.
Read Also: Minister Narayana: టిడ్కో ఇళ్లపై ఎమ్మెల్యేల ప్రశ్నలు.. మంత్రి నారాయణ ఆసక్తికర సమాధానాలు..
అయితే, ప్రైవేట్ సంస్థల ప్రాతినిధ్యం పెరిగితే, ఈ సంస్థ ఇబ్బందుల్లో పడుతుంది అని సీఎం రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. అందుకే మేం అలాంటి ఆలోచన చేయడం లేదు.. మేము కొంత పెంచాలి అనుకున్నాం.. శ్రీధర్ బాబు మా దగ్గరికి వచ్చి లేదు ఎక్కువ ఇవ్వాలని ధర్నా చేశారు.. అందుకే 34 శాతం బోనస్ ఇస్తున్నామన్నారు. ప్రపంచంతో పోటీ పడేలా సింగరేణి ముందుకు నడవాలి.. ఓపెన్ మార్కెట్ తో పోటీ పడుతుంది. ఆయాచిత లబ్ది కోసం సింగరేణి చూడదు.. ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్తామన్నారు. సింగరేణి కార్మిక సంఘాలతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటాం.. ఇప్పటికే, దసరా అడ్వాన్స్ 25 వేలు ఇప్పటికే ఇచ్చేశాం.. సింగరేణికి విద్యుత్ సంస్థలు, విద్యుత్ సంస్థలకు ప్రభుత్వం బకాయి ఉంది.. ఇది క్లిష్టమైన సమస్య, ఆదాయం పెరగకుండా.. ధరలు పెంచకుండా ఏం చేయాలని ఆలోచిస్తున్నాం.. కేంద్రం వయబుల్ గ్యాప్ ఇస్తామనింది.. ఇప్పటి వరకు ఇవ్వలేదు.. GST కౌన్సిల్ మీటింగ్ లో భట్టి నివేదిక ఇచ్చారు.. వచ్చే ఐదేళ్లకు వయాబుల్ గ్యాప్ పెంచాలని డిమాండ్ చేస్తున్నాం.. దీనిపై ప్రధాని మోడీ ఆలోచన చేయాలి.. కిషన్ రెడ్డి ప్రధాని దగ్గరికి వెళ్ళి రాష్ట్రానికి వయబుల్ నిధులు తెప్పించాలని రేవంత్ రెడ్డి కోరారు.