Harish Rao: కాంగ్రెస్ పార్టీ అధికారిక వెబ్సైట్లో అబద్ధాలు.. హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు..
- ఆరు గ్యారెంటీల పేరుతో ప్రజలను మోసం చేశారు..
- రుణమాఫీ చేస్తామని మాట తప్పారు..
- కాంగ్రెస్ పార్టీ అధికారిక వెబ్సైట్లో అబద్ధాలు పెట్టారు-హరీష్ రావు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Harish Rao: కాంగ్రెస్ పార్టీ అధికారిక వెబ్సైట్లో అబద్ధాలు పెట్టారని మాజీ మంత్రి హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆరు గ్యారెంటీల పేరుతో ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు. రుణమాఫీ చేస్తామని మాట తప్పారుని కీలక వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి తన అబద్ధాల ప్రవాహాన్ని మహారాష్ట్ర లో కొనసాగించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆరు గ్యారంటీ లు ఇచ్చి అమలు చేయకుండా తెలంగాణ లో మోసం చేశారని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రుణమాఫీ చేస్తాం అని చెప్పి మాట తప్పినం అని మహారాష్ట్ర లో చెప్పాల్సి ఉండే అన్నారు. మహారాష్ట్ర కు వెళ్లి అన్ని గ్లోబల్స్ ప్రచారం చేశారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ అధికారిక వెబ్సైట్ లో అబద్ధాలు పెట్టారని మండిపడ్డారు. మహాలక్ష్మి, రైతు భరోసా, రైతు కూలీలకు డబ్బులు, వరిపంట కు బోనస్, అమలు చేయట్లేదు అని చెప్పాల్సి ఉండే అన్నారు. తెలంగాణ లో అన్ని వర్గాలను రేవంత్ రెడ్డి మోసం చేశారని మండిపడ్డారు. మేము మహారాష్ట్ర లో పోటీ చేయట్లేదన్నారు. అక్కడికి వెళ్లి ప్రచారం చేయమన్నారు. అందుకే ఇక్కడి నుండే కాంగ్రెస్ మోసాలపై చెబుతున్నామని క్లారిటీ ఇచ్చారు. రేవంత్ రెడ్డి మహారాష్ట్ర లో కాంగ్రెస్ ఎన్నికల ప్రచారం కోసం తెలంగాణ డబ్బులు వాడుతున్నారని ఆరోపించారు.
Read also: Jagtial Road Accident: కుటుంబంలో విషాదం నింపిన రిసెప్షన్.. వధువు అన్న మృతి..
Also Read
- iBomma Ravi : ఐబొమ్మ రవికి కోర్టులో ఊరట.. రూ.3 కోట్లపై మాత్రం నో.!
- Telangana 22A Lands: 22A భూములకు గ్రీన్ సిగ్నల్.. ఇక వాటికి రిజిస్ట్రేషన్లు.!
- CM Revanth Reddy : సీఎం రేవంత్ రెడ్డికి ప్రతిష్టాత్మక 'ఆర్యదాన్ ముహమ్మద్' పురస్కారం
- Mahadev Betting App Case: మహదేవ్ కేసులో బిగ్ అరెస్ట్.. ఎయిర్‌పోర్టులోనే పట్టివేత.!
నిన్న జరిగిన మెదక్ జిల్లా కొల్చారం మండల కేంద్రంలో రైతు వ్యతిరేక విధానాలపై బీఆర్ఎస్ రైతు గర్జన కార్యక్రమం హరీష్ రావు తీవ్ర విమర్శలు చేసిన విషయం తెలిసిందే. మొద్దు నిద్ర పోతున్న కాంగ్రెస్ ప్రభుత్వం కళ్ళు తెరవాలని కీలక వ్యాఖ్యలు చేశారు. రైతు బంధు, రుణమాఫీ, ధాన్యం కొనుగోళ్ళ కోసం రైతు దీక్ష చేస్తున్నాం.. తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని ఎత్తి చూపేందుకే రైతు దీక్ష చేస్తున్నామన్నారు. ఎన్నికల్లో చెప్పని ఎన్నో పథకాలు రైతుల కోసం కేసీఆర్ పెట్టారు.. రైతుల సీఎం కేసీఆర్ అని ఇతర రాష్ట్రాల్లోనూ అన్నారని హరీష్ రావు తెలిపారు. భూతుల సీఎంగా రేవంత్ రెడ్డి చరిత్రలో నిలిచారు.. ఆరు గ్యారెంటీలు అమలు చేసిన అని మహారాష్ట్రలో రేవంత్ చెపుతున్నారు.. అందరిని మోసం చేసి మహారాష్ట్రలో అబద్దాలు మాట్లాడుతున్నారని పేర్కొన్నారు.
Bike Racing: అర్ధరాత్రి రెచ్చిపోతున్న యువకులు.. రాయదుర్గం టీహబ్ వద్ద బైక్ రేస్..
తాజావార్తలు
-
Makkah Defence Pact: భారత్‌తో యుద్ధంలో తండ్రి మృతి.. ఇప్పుడు ‘మక్కా కూటమి’కి సారథిగా కుమారుడు
-
OTR: రిజర్వేషన్స్ మారిపోయినా పట్టు తగ్గకుండా సీనియర్స్ జాగ్రత్తలు..
-
Piyush Goyal: భారత్-అమెరికా ఒప్పందంపై పీయూష్ గోయల్ కీలక ప్రకటన
-
Traffic: ట్రాఫిక్ కష్టాలకు శాశ్వత పరిష్కారం.. తెలంగాణలో కొత్త విధివిధానాలు అమల్లోకి..
-
బాక్సాఫీస్ వద్ద నాని ఊచకోత.. ‘The Paradise’ ప్రీమియర్స్‌తో సరికొత్త హిస్టరీ! కలెక్షన్స్ ఎంతంటే?
ట్రెండింగ్
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!