Jagtial Road Accident: కుటుంబంలో విషాదం నింపిన రిసెప్షన్.. వధువు అన్న మృతి..
- జగిత్యాల -కరీంనగర్ జాతీయ రహదారి ఫై దరూర్ వద్ద కారు ను ఢీ కొట్టిన ఆర్టీసీ బస్..
- కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు మృతి- మరో ఇద్దరికీ తీవ్ర గాయాలు..
- ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రమాదంపై విచారణ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jagtial Road Accident: మంగళ వాయిద్యాలు, వేద మంత్రాలతో వధూవరులు ఏకమయ్యారు. ఆ తర్వాత రిసెప్షన్ జరగాల్సి వుంది. ఈ వేడుకకోసం వధువు కుటుంబం బయలు దేరింది ఇంతలోనే విధి చిన్న చూపుచూసింది. రోడ్డు ప్రమాదంలో వధువు అన్న, తన స్నేహితురాలు మృతి చెందగా.. వధువు తల్లి దండ్రులు కొన ఊపరితో కొట్టమిట్టాడుతున్నారు. ఈఘటన జగిత్యాల -కరీంనగర్ జాతీయ రహదారి ఫై దరూర్ వద్ద చోటుచేసుకుంది.
Read also: Actress Kasturi : పరారీలో నటి కస్తూరి.. పోలీసుల గాలింపు
Also Read
- Free Cool Drinks Go Viral : ఉచితం అనగానే ఎగబడ్డారు.. బాటిల్ చూస్తే షాక్..
- Jagtial: తప్పిన పెను ప్రమాదం.. స్కూల్ బస్సును ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.!
- Monkey Fight : జగిత్యాలలో ఘోరం.. మహిళను బలితీసుకున్న కోతుల కొట్లాట.!
- Dubai Road Accident: దుబాయిలో ఘోర రోడ్డు ప్రమాదం.. జగిత్యాలకు చెందిన ముగ్గురు దుర్మరణం
హన్మకొండలోని యువకుడితో కూతురి పెళ్లిని ఘనంగా జరిపించారు తల్లిదండ్రులు. ఇక రిసెప్షన్ వేడుక హనుమకొండలో ఉండటంతో వధువు కుటుంబ సభ్యులు బయలుదేరారు. రిసెప్షన్ వేడుక కూడా హంగులు, ఆర్భాటాలు, నవ్వులు, చిందులు వేస్తూ అందరూ గడిపారు. ఇక ఇంటికి వెళ్లేందుకు వధువు అన్న, తన స్నేహితురాలు, తల్లిదండ్రులు బయలు దేరారు. జగిత్యాల -కరీంనగర్ జాతీయ రహదారి ఫై దరూర్ వద్దకు రాగానే జగిత్యాలకు చెందిన డిపోకి చెందిన సూపర్ లగ్జరీ బస్సు.. కారును బలంగా ఢీకొట్టింది. దీంతో ప్రమాదంలో వధువు అన్న సంకీర్త్, స్నేహితురాలు రాజీ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. కారు వెనుక సీట్లో కూర్చున్న వధువు తల్లి,దండ్రులకు తీవ్ర గాయాలయ్యాయి. తల్లి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కారును ఢీకొట్టిన బస్సు డైవర్ ను అదుపులో తీసుకున్నారు. జగిత్యాల డిపోకు చెందిన ఆర్టిసి బస్సు ముందు టైరు ఊడిపోయి ఉండటం పోలీసులు గమనించారు. అయితే.. టైరు ఊడిపోయి ప్రమాదం జరిగిందా? లేక ఢీకొట్టిన సమయంలో టైరు ఓడిపోయిందా? అనే దానిపై డ్రైవర్ తో దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై ఇంకా క్లారిటీ రాలేదు. ఈ సంఘటనపై బాధిత కుటుంబ సభ్యులకు తెలిపారు. దీంతో కూతురి రిసెప్షన్ వేడుకలో తీవ్ర విషాదం నెలకొంది. ఒక పక్క నవ వధువు .. మరో పక్క అన్న మృతదేహాం.. ప్రాణాలతో కొట్టు మిట్టాడుతున్నతల్లిదండ్రులను చూసి కుటుంబ సభ్యులు, రిసెప్షన్ కు వచ్చిన వారందరూ కన్నీరుమున్నీరుగా విలపించారు. దీంతో ఆసుపత్రి వాతావరణం అంతా కుటుంబ రోదనలతో నిండిపోయింది.
Nara Lokesh: చేనేతలను అన్ని విధాలా ఆదుకుంటాం: మంత్రి నారా లోకేష్
తాజావార్తలు
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Ganesh Acharya Biopic: తెరపైకి స్టార్ కొరియోగ్రాఫర్ లైఫ్ స్టోరీ.. ‘గణేశ్’ ట్రైలర్ చూశారా!
-
Smriti Mandhana: బాలల హక్కుల కోసం స్మృతి మంధాన ముందడుగు.. ఆహ్వానించిన సచిన్ టెండూల్కర్..
-
Pakistan: పాకిస్తాన్లో అరాచక పాలన.. ఖైబర్ ఫఖ్తుంఖ్వాలో ఎమర్జెన్సీ.!
-
Rajinikanth: బాషా 2.. పేట 2 వద్దని.. జైలర్ 2కి తలైవా ఎందుకు ఒప్పుకున్నారు?
ట్రెండింగ్
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..