Kishan Reddy: ఖమ్మం జిల్లా దంచాలపురంలో పర్యటించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వరద ముంపు ప్రాంతాలు పర్యటించి.. బాధితులను పరామర్శించారు. స్వయంగా తానే ముంపు బారిన పడ్డ ఇండ్లను పరిశీలించారు. బాధితులకు అండగా ఉంటామని భరోసానింపారు. ఖమ్మం ధంసలాపురంలోని ఓ ఫంక్షన్ హాల్ లో వరద బాధితులకు నిత్యవసర వస్తువులను కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పంపిణీ చేశారు.. ఈ కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హాజరయ్యారు. అనంతరం కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. ఖమ్మంలో ఎన్నడూ లేని విధంగా వరదలు సంభవించాయని అన్నారు. ఈ వరదల్లో ఎంతోమంది ప్రజలు నిరాశ్రయులు అయ్యారని కేంద్రమంత్రి అన్నారు.
Read also: Hydra: హైదరాబాద్ లో అక్రమ నిర్మాణాలు కూల్చివేస్తున్న హైడ్రా..
మున్నేరు వరద బాధితుల సమస్యలను అడిగి తెలుసుకున్న అనంతరం పరివాహక ప్రాంతాన్ని వాగు పరిస్థితిని పరిశీలించారు. అనంతరం అగ్రహారం కాలనీ వద్ద ఉన్న కందగడ్ల ఫంక్షన్ హాల్ లో మున్నేరు వరద బాధితులకు నిత్యవసర సరుకులు, దుప్పట్లు పంపిణీ చేశారు. ఇది రాజకీయాలు చేసే సమయం కాదని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ప్రజల కోసం పనిచేస్తాయని ఆయన అన్నారు. వరదలు సంభవించిన సమయంలో ప్రధాని నరేంద్ర మోడీ సీఎం రేవంత్ రెడ్డికి ఫోన్ చేసి వరదలపై ఆరా తీశారని తెలిపారు. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వం వద్ద అడ్వాన్స్ డిజాస్టర్ ఫండ్ కింద 1345 కోట్లు నిల్వ ఉంచారని వాటిని ప్రజలు కోసం ఖర్చు చేయమని మోదీ ఆదేశించారాని తెలిపారు. అది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో అడ్వాన్స్ డిజాస్టర్ ఫండ్ రాష్ట్రాల వద్ద ఉంచాలని తీర్మానం చేసిందన్నారు.
Read also: Murali Mohan: హైడ్రా అవసరం లేదు.. మేమే కూల్చేస్తాం.. నోటీసులపై మురళీమోహన్..
మున్నేరు వరద బాధితులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పుడు అండగా ఉంటాయని అన్నారు. వరద ప్రాంతాల్లో ప్రజల పరిస్థితి దయనీయంగా ఉందని, వరద బాధితులు కష్టాల్లో ఉన్నారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం వరద బాధితులను తప్పకుండా ఆదుకుంటుందన్నారు. క్షణాల్లో వచ్చిన భారీ వరద తీవ్ర నష్టాన్ని మిగిల్చిందని తెలిపారు. స్టేట్ డిజాస్టర్ నిధులతో వరద బాధితులను ఆదుకోవాలన్నారు. ఇది ప్రకృతి వైపరీత్యం. కలిసికట్టుగా అందరూ నడవాలన్నారు. మరోసారి తుఫాన్ ముప్పు నేపథ్యంలో అధికారులు రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలన్నారు. పార్టీ తరఫున వరద బాధితులకు తాత్కాలికంగా నిత్యవసర వస్తువులు పంపిణీ చేస్తున్నామన్నారు. వరద బాధితులను ఆదుకోవడానికి సామాజిక సంస్థలు స్వచ్ఛంద సంస్థలు కలిసి రావాలన్నారు.
Read also: Karimnagar: అసలే కోతులు.. కంగారు పెట్టి చివరకు నవ్వించిన ఘటన..
రాష్ట్ర ప్రభుత్వ నుండి నివేదిక వచ్చిన తర్వాత పూర్తిస్థాయిలో నిధులు అందిస్తామన్నారు. SDF నిధులను గత ప్రభుత్వం సరిగ్గా వినియోగించుకోలేదు.. యుటిలైజేషన్ సర్టిఫికెట్ కూడా ఇవ్వలేదని తెలిపారు. కేంద్ర హోశాఖ తో మాట్లాడి ఎస్డిఎఫ్ నిధులు వినియోగించుకునేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. అదనపు డిజాస్టర్ నిధులు విడుదలయ్యేలా చూస్తామన్నారు. కేంద్రానికి ఆన్ని రాష్ట్రాలు సమానమే అని.. వరద సహాయ నిధుల విషయంలో రాష్ట్రాల పట్ల వివక్ష లేదన్నారు. రాష్ట్రంలో వరదపై కేంద్రం స్పందిస్తున్న తీరుకు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. ధనిక రాష్ట్రమని గొప్పలు చెప్పకుండా.. వాస్తవాన్ని కేంద్రానికి నివేదించిన్నామని తెలిపారు. విపత్తు సమయంలో కూడా విపక్షాలు రాజకీయ విమర్శలకే ప్రాధాన్యత ఇస్తున్నాయన్నారు.
Tirupati Laddu: టీటీడీ అన్ని ఆలయాల్లో తిరుపతి లడ్డూలు.. హైదరాబాద్‌లో ఎక్కడంటే..