మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటిస్తున్న కన్నప్ప సినిమా త్వరలో రిలీజ్‌కి రెడీ అవుతోంది. అయితే కన్నప్ప సినిమాకి సంబంధించిన హార్డ్ డిస్క్ ఒకటి మిస్ అయిందంటూ ఈ రోజు ఉదయం కరీంనగర్ పోలీస్ స్టేషన్‌లో కంప్లైంట్ నమోదు అయినట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే ఇప్పటివరకు ఈ విషయం మీద మంచు విష్ణు గానీ ఆయన నిర్మాణ సంస్థ కానీ అధికారికంగా స్పందించలేదు. తాజాగా మంచు విష్ణు నిర్మాతగా వ్యవహరిస్తున్న 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ సంస్థ అధికారికంగా స్పందించింది. ముంబై నుంచి హైదరాబాద్ రావాల్సిన ఒక హార్డ్ డిస్క్ మిస్ అయిందని, అందులో ఇద్దరు లీడ్ యాక్టర్స్ మధ్య ఉన్న కీలకమైన యాక్షన్ సీక్వెన్స్ ఉందని, దానికి సంబంధించిన విఎఫ్ఎక్స్ వర్క్‌తో కూడిన హార్డ్ డిస్క్‌నే మిస్ అయిందని చెప్పుకొచ్చారు.
Also Read:Pushpa: పుష్పలో నారా రోహిత్.. కానీ?
ముంబైలోని హైవ్ స్టూడియోస్ నుంచి హైదరాబాదులోని ప్రొడక్షన్ హౌస్ ఆఫీస్‌కి రావాల్సి ఉందని వెల్లడించారు. చరిత అనే ఒక మహిళ ఆదేశాల ప్రకారం రఘు అనే వ్యక్తి దాన్ని ఆఫీస్ అడ్రస్ నుంచి సైన్ చేసి తీసుకున్నాడు. అయితే రఘు కానీ చరిత కానీ ఇద్దరికీ 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీతో సంబంధం లేదు. ఖచ్చితంగా వీరిద్దరూ సినిమాకి ఏదో నష్టం చేయాలని దాన్ని దొంగలించారని పేర్కొన్నారు. సుమారు నాలుగు వారాల క్రితమే దీనికి సంబంధించి పోలీస్ కంప్లైంట్ ఇచ్చామని, దీని వెనక ఎవరున్నారో అధికారులు మా దృష్టికి తీసుకువచ్చారని పేర్కొన్నారు. అయితే దీని వెనక ఎవరున్నారో అది బహిరంగ రహస్యమేనని పేర్కొన్నారు. అలాగే మాకు అందుతున్న సమాచారం మేరకు వీరందరూ కలిసి ఆన్‌లైన్‌లో లేని ఫుటేజ్ సంబంధించి 90 నిమిషాల్లో రిలీజ్ చేయాలని కన్నప్ప సినిమాని చంపేయాలని ప్రయత్నిస్తున్నట్టు మా దృష్టికి వచ్చింది.
Also Read:Pawan Kalyan: సినిమా హాళ్ల బంద్ వెనుక జనసేన వాళ్ళు ఉన్నా వదలొద్దు!
ఈ నేపథ్యంలోనే ఈ విషయాన్ని సైబర్ క్రైమ్ అధికారి దృష్టికి మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ తీసుకువెళ్లారు. మన సినీ పరిశ్రమలోనే సినిమాలను చంపేందుకు ఇలాంటి ప్రయత్నాలు చేయడం బాధాకరం. ఇది కచ్చితంగా ఆకతాయితనంగా చేసింది కాదు. ఎంతో ప్లాన్ చేసి కోట్ల విలువైన సినిమాని చంపేసే ప్రయత్నం. ఒక పర్సనల్ పగతో ఇలా చేయడం కరెక్ట్ కాదు. తెలుగు సినిమా కండంతరాలు దాటుతున్న సమయంలో ఇలాంటి ప్రయత్నాలు ఏమాత్రం సరికాదు. ఇలాంటి ప్రయత్నాలకు కన్నప్ప టీం ఏమాత్రం బెదరదు. కచ్చితంగా మాకు న్యాయం జరుగుతుంది. మేము నిజాన్ని నమ్మాం, అది ఎప్పుడూ మమ్మల్ని గెలిపిస్తుంది. ఒకవేళ పైరసీ కంటెంట్ వచ్చినా సరే, పబ్లిక్ గానీ మీడియా గానీ దాన్ని ఎంటర్టైన్ చేయవద్దని సంస్థ కోరింది.