Site icon NTV Telugu

Telangana: అర్ధరాత్రి రోడ్డెక్కిన నిరుద్యోగులు.. రంగంలోకి సీఆర్పీఎఫ్‌ బలగాలు..

Student Protest

Student Protest

Telangana: గ్రూప్‌-2 పరీక్షలు యథావిధిగా నిర్వహిస్తామని సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతొ రాష్ట్రంలోని నిరుద్యోలు అందరూ శనివారం అర్థరాత్రి నిరుద్యోగులు పెద్దఎత్తున ఆందోళనకు దిగారు. గ్రూప్ -2, గ్రూప్ -3 పోస్టుల పెంపుతో పాటు డిసెంబర్ లో పరీక్షలు నిర్వహించాలని డిమాండ్ చేస్తూ శనివారం రాత్రి అశోక్ నగర్ చౌరస్తాలో వేలాది మంది నిరుద్యోగులు మెరుపు ధర్నాకు దిగారు. చిక్కడపల్లి సిటీ సెంట్రల్ లైబ్రరీ నుంచి అశోక్ నగర్ చౌరస్తా వరకు భారీ ర్యాలీ చేపట్టారు. చౌరస్తాలోని రోడ్డుపైనే కూర్చుని ధర్నా చేపట్టారు. రాత్రి 9 గంటల నుంచి అర్ధరాత్రి వరకు అక్కడే రాస్తా రోకో చేపట్టారు.

Read also: What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే.?

ఇక మరోవైపు డీఎస్సీ పరీక్షలను వాయిదా వేయాలని డిమాండ్ చేస్తూ నిరుద్యోగులు దిల్ సుఖ్ నగర్ రాజీవ్ చౌక్ చౌరస్తాలో భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వెంకటాద్రి థియేటర్ నుంచి మెట్రో స్టేషన్ వరకు ర్యాలీ చేపట్టారు. రాజీవ్‌చౌక్‌ వద్ద ధర్నా. డీఎస్సీని వెంటనే వాయిదా వేయాలని డిమాండ్ చేశారు. మాకు న్యాయం జరగాలన్నారు. తమ సమస్యను రాష్ట్ర భవిష్యత్తు కోణంలో చూడాలని ప్రభుత్వాన్ని కోరారు. న్యాయమైన డిమాండ్లతో తమ ధర్నాలను రాజకీయం చేయడం సమంజసం కాదని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అభ్యర్థులు ఆందోళనకు దిగడంతో దిల్‌సుఖ్‌నగర్‌తో పాటు ఎల్‌బీనగర్‌లోనూ పోలీసులు భారీగా మోహరించారు.

Read also: IND vs PAK: అంబటి రాయుడు హాఫ్ సెంచరీ.. పాకిస్థాన్‌పై భారత్ ఘన విజయం! 15 రోజుల్లో రెండు కప్స్

నిరుద్యోగుల మెరుపు ధర్నాతో అశోక్‌నగర్‌, దిల్‌సుఖ్‌నగర్‌, ఎల్‌బీనగర్‌, చిక్కడప్లలి ఆర్టీసీ క్రాస్ రోడ్డు మార్గాల్లో ట్రాఫిక్‌ స్తంభించింది. గంటల తరబడి వాహనాలు రోడ్లపైనే నిలిచిపోయాయి. మరోవైపు అశోక్‌నగర్‌లో ఏసీపీ రమేష్‌ ఆధ్వర్యంలో దోమలగూడ, ముషీరాబాద్‌ పీఎస్‌లతోపాటు రోడ్లపై అదనపు సీఆర్పీఎఫ్ బలగాలను మోహరించారు. నిరుద్యోగులను బలవంతంగా పంపించే ప్రయత్నం చేశారు. అయితే తమ డిమాండ్లు సాధించే వరకు ఉద్యమించేది లేదని అభ్యర్థులు రోడ్లపైనే కూర్చున్నారు. అర్ధరాత్రి దాటినా పరిస్థితి అదుపులోకి రాలేదు.
Raviteja : మాస్ రాజా పవర్ మరోసారి చూపించేందుకు ఏర్పాట్లు…

Exit mobile version