గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) పరిపాలనా వ్యవస్థను మరింత విస్తృతం చేస్తూ తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నగరం ఔటర్ రింగ్ రోడ్ (ORR) వరకు విస్తరించడంతో పరిపాలనను ప్రజలకు మరింత చేరువ చేయాలనే ఉద్దేశంతో జోన్లు, సర్కిల్స్ సంఖ్యను పెంచింది. 6 నుండి 12 జోన్లు.. 30 నుండి 60 సర్కిల్స్‌కు పెంచింది.. ప్రస్తుతం ఉన్న 6 జోన్లను 12కు.. ఉన్న 30 సర్కిల్స్‌ను 60కు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది..
Read Also: Nani: హీరో నాని కొత్త సినిమాపై వైరల్ అప్డేట్..
కొత్తగా ఏర్పాటు చేసిన జోన్లు: ఉప్పల్, కుత్బుల్లాపూర్, మల్కాజ్గిరి, శంషాబాద్, గోల్కొండ, రాజేంద్రనగర్ కాగా.. సర్కిల్ కార్యాలయాల్లో కొత్త జోన్ కార్యాలయాలు ఏర్పాటు చేయనున్నారు.. వార్డు కార్యాలయాల్లో కొత్త సర్కిల్ కార్యాలయాలు ఏర్పాటు కానున్నాయి.. త్వరలో ఈ కొత్త జోనల్, సర్కిల్ కార్యాలయాల నుంచే పరిపాలన ప్రారంభం కానుంది.
ఇక, 300 వార్డులతో డీలిమిటేషన్ ఫైనల్ నోటిఫికేషన్ వచ్చేసింది.. GHMC వార్డుల పునర్విభజన (Delimitation) ప్రక్రియకు సంబంధించి కూడా ఫైనల్ నోటిఫికేషన్‌ను అధికారులు విడుదల చేశారు. ఈ నెల 9న ప్రాథమిక నోటిఫికేషన్ విడుదల చేయగా.. 10 రోజుల పాటు అభ్యంతరాలు స్వీకరించారు.. ప్రజలు, ప్రజాప్రతినిధుల నుంచి 6,000కు పైగా అభ్యంతరాలు రాగా.. సహేతుకమైన అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుని 300 వార్డులతో ఫైనల్ నోటిఫికేషన్ విడుదల చేశారు.