Prevention Dogs: వీధి కుక్కల దాడులతో తెలంగాణ రాష్ట్ర ప్రజలు భయాందోళనకు గురి అవుతున్నారు. బయటకు రావాలంటే జంకుతున్నారు. చిన్న పిల్లలు కనిపిస్తే చాలు విచక్షణారహితంగా వారిపై విరుచుకుపడి పీక్కుతింటున్నాయి. దీంతో పిల్లలు ఇన్ ఫెక్షన్ కు గురియై ప్రాణాలు కోల్పోతున్నారు. దీంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. దీనిపై ఓ వ్యక్తి హైకోర్టులో పిల్ దాఖలు చేయడంతో ప్రభుత్వం పై సీరియస్ అయ్యింది. కుక్కల దాడులపై వెంటనే వివరణ ఇవ్వాలని కోరింది. ఇక మరోవైపు కుక్కల దాడుల్లో చిన్నారులు మృత్యువాత పడటంతో సీఎం రేవంత్ రెడ్డి అధికారులపై తీవ్రంగా మండిపడ్డారు. వీధికుక్కల వల్ల ముఖ్యంగా పసికందుల వల్ల మరణాలు సంభవించకుండా తగిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఈ నేపథ్యంలో జీహెచ్ ఎంసీ తగు చర్యలు చేపట్టేందుకు సిద్ధమైంది.
Read also: Gold Rate Today: మగువలకు శుభవార్త.. వరుసగా రెండోరోజు తగ్గిన బంగారం ధరలు!
ప్రభుత్వం రాష్ట్ర, మునిసిపల్ స్థాయిలో కమిటీని నియమించింది. ఈ కమిటీలు వీధికుక్కలను జనావాస కేంద్రాలు లేని మారుమూల ప్రాంతాలకు తరలించాలని తెలిపింది. వాటి సంతానం పెరగకుండా శస్త్ర చికిత్సలు చేయడం, కుక్కలకు యాంటీ రేబిస్ వ్యాక్సిన్‌లు వేయడం వంటి వాటిని నిర్వహించాల్సి ఉంటుందని వెల్లడించింది. జిహెచ్‌ఎంసి పరిధిలో గతేడాది అంబర్‌పేట, జోనల్ స్టేలో మానిటరింగ్ కమిటీలను ఏర్పాటు చేశారు. యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా, యానిమల్ బర్త్ కంట్రోల్ రూల్స్- 2023 ప్రకారం వీటిని ఏర్పాటు చేసినట్లు జీహెచ్‌ఎంసీ వెటర్నరీ విభాగం తెలిపింది. అయితే.. ఈ నేపథ్యంలో కమిటీలు నిర్ణీత వ్యవధుల్లో, అవసరమైన సందర్భాల్లో సమావేశమై పరిస్థితుల్ని సమీక్షించేలా తగిన చర్యలు తీసుకోనున్నారు.
Read also: Lal Darwaza Bonalu: పాతబస్తీలో ప్రారంభమైన బోనాలు.. వెయ్యి మంది పోలీసులతో భారీ బందోబస్తు..
సమీక్ష ప్రకారం, అధికారులు అవసరమైన ఏర్పాట్లు చేయడం లేదని మండిపడింది. పాఠశాలల్లో విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు గతంలో మాదిరిగా ఒక సారి మాత్రమే పరిమితం కాకుండా నిర్ణీత వ్యవధిలో నిర్వహించాలని అధికారులు తెలిపారు. బడిబయట పిల్లలతో వ్యవహరించే పద్ధతులు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజల్లో విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని యోచిస్తున్నారు. ముఖ్యంగా పేదలు, కార్మికులు నివసించే మురికివాడల్లో పిల్లల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించనున్నారు. వీటికి తోడు కుక్కల బెడద పెరగకుండా గర్భనిరోధక శస్త్రచికిత్సలను పెంచనున్నారు. గత పదేళ్లలో 7,21,291 కుక్కలకు ఆపరేషన్లు చేసినట్లు జీహెచ్‌ఎంసీ తెలిపింది. మూసీనది పరిసర ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో కుక్కలు కనిపించడంతో స్పెషల్ డ్రైవ్ నిర్వహించినట్లు తెలిపారు. భవిష్యత్తులో అవసరాల మేరకు ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహించే యోచనలో ఉన్నట్లు సంబంధిత అధికారి తెలిపారు. కుక్కలు విషయంలో చేయాల్సినవి, చేయకూడని వాటిపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. ఇందుకోసం కాలనీ, ప్రజాసంఘాల సహకారం తీసుకోవాలని భావిస్తున్నారు.
Fake Challan Scam Case: నకిలీ చలాన్ స్కామ్ కేసు.. ఛార్జిషీట్ సిద్ధం..