GHMC Council Meeting: ఈరోజు ఉదయం 10 గంటలకు బల్దియా కౌన్సిల్ సమావేశం ప్రారంభమైంది. జీహెచ్‌ఎంసీ కౌన్సిల్ సమావేశం ప్రారంభమైన కొద్ది నిమిషాల్లోనే గందరగోళంగా మారింది. మేయర్ రాజీనామా చేయాలని బీఆర్‌ఎస్ కార్పొరేటర్లు డిమాండ్ చేస్తున్నారు. జీహెచ్‌ఎంసీ కార్యాలయం ఎదుట బీజేపీ కార్పొరేటర్లు ఆందోళనకు దిగారు. హైదరాబాద్ డ్రైనేజీ సిటీ అంటూ కార్పొరేటర్లు నిరసనకు దిగారు. కాల్వలను అనుసంధానం చేసి ఇంకుడు గుంతలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశానికి కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎక్స్ అఫీషియో సభ్యులు, బీజేపీ ఎంపీలు ఈటల రాజేందర్, రఘునందన్ రావు, ఎమ్మెల్యే రాజాసింగ్ హాజరయ్యారు. బీఆర్‌ఎస్ కార్పొరేటర్ల మద్దతుతో గద్వాల్ విజయలక్ష్మి, మోతె శ్రీలత మేయర్, డిప్యూటీ మేయర్ అయ్యారు. వీరిద్దరూ పార్టీ మారడంతో మేయర్, డిప్యూటీ మేయర్లపై అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు బీఆర్ఎస్ పార్టీ సిద్ధమైంది.
Read also: Rangareddy: రంగారెడ్డి టీచర్ల బదిలీల్లో గందరగోళం.. రిటైర్డ్ అయిన టీచర్ కి పదోన్నతి..
కాగా.. మేయర్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి బీఆర్‌ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లో చేరారు. ఈ నేపథ్యంలో బీఆర్‌ఎస్ పార్టీకి చెందిన గ్రేటర్ ప్రజాప్రతినిధులు ఈ సమావేశానికి హాజరుకావాలని బీఆర్‌ఎస్ పార్టీ నిర్ణయించింది. పార్టీ మారిన మేయర్ రాజీనామా డిమాండ్, అభివృద్ధి, ఆరు హామీల అమలుపై బీఆర్ఎస్ బహిరంగంగా ప్రశ్నిచేందుకు సిద్దమైంది. గత కొన్ని నెలలుగా జంపింగ్ జపాంగ్‌లు ఉన్నప్పటికీ, BRS కార్పొరేటర్లు, ఎక్స్-అఫీషియో సభ్యులతో BRS ఈరోజు బలంగా ఉంది. 150 మంది కార్పొరేటర్లలో ఇద్దరు ఎంఐఎం కార్పొరేటర్లు ఎమ్మెల్యేలు కాగా, మరో ఇద్దరు ఎర్రగడ్డ, గుడిమల్కాపూర్ కార్పొరేటర్లు చనిపోయారు. ప్రస్తుతం 47 మంది బీఆర్‌ఎస్ కార్పొరేటర్లతో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎక్స్ అఫీషియో సభ్యులు ఉన్నారు. ఎంఐఎంకు 41 మంది, బీజేపీకి 39 మంది, కాంగ్రెస్‌కు 19 మంది సభ్యులు ఉన్నారు.
Hot Water Drinking : గోరువెచ్చని నీరు తాగడంవల్ల నిజంగా బరువును తగ్గవచ్చా.. అసలు నిజమేంటంటే..