Dussehra Holidays: తెలంగాణలో ఇప్పటికే స్కూల్ విద్యార్థులు దసరా సెలవులు ఎంజాయ్ చేస్తున్నారు.. అయితే, ఇప్పుడు జూనిర్ కాలేజీలకు కూడా సెలవులు వచ్చేస్తున్నాయి.. తెలంగాణలో ఇంటర్ కాలేజీలకు 2025 సెప్టెంబర్ 28వ తేదీ నుంచి అక్టోబర్ 5వ తేదీ వరకు సెలవులు ప్రకటించిన విషయం విదితమే.. కానీ, ఒక రోజు ముందుగానే అంటే రేపటి నుంచి ఈ నెల 27వ తేదీ న ఉంచి తెలంగాణలో జూనియర్ కాలేజీలకు దసరా సెలవులు ప్రారంభం కాబోతున్నాయి.. అంటే, ముందుగా ప్రకటించినట్లు కాకుండా ఒక రోజు ముందు నుండే దసరా సెలవులు ప్రారంభం అవుతాయి.. ఇక, ముందుగా ప్రకటించిన ప్రకటారం.. వచ్చే నెల 5వ తేదీ వరకు జూనియర్ కాలేజీలకు సెలవులు కొనసాగనున్నాయి.. కాగా, సెప్టెంబర్ 21వ తేదీ నుంచి తెలంగాణలోని ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లకు దసరా హాలీడేస్ ఇచ్చారు.. అక్టోబర్ 3 వరకు అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు దసరా సెలవులు ప్రకటించారు. ఈ సెలవులను బతుకమ్మ, దసరా పండుగల నేపథ్యంలో ఇస్తున్నట్లు విద్యాశాఖ అధికారులు తెలిపిన విషయం విదిమతే.. ఇక, అన్ని కాలేజీలు సెలవుల షెడ్యూల్ ను తప్పకుండా పాటించాలి.. సెలవుల్లో క్లాస్ లు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు తెలంగాణ ఇంటర్ బోర్డు సెక్రటరీ..
Read Also: OG DAY 1 COLLECTIONS : OG తెలుగు రాష్ట్రాల మొదటి రోజు ఏరియాల వారీగా కలెక్షన్స్.. రికార్డ్ మిస్