CPI Narayana: సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనపై సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇందులో పోలీసుల తప్పేమీ లేదని ఆయన అన్నారు. కుటుంబంతో కలిసి సినిమా చూసేందుకు వెళ్లిన ఓ మహిళ ప్రాణాలు కోల్పోయిందని తెలిపారు. ఆ ఘటన దురదృష్టకరమన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సూచించారు. అదేవిధంగా సినిమా టిక్కెట్ల రేట్ల పెంపును తీవ్రంగా ఖండించారు.
Read also: Congo: కాంగోలో పడవ బోల్తా.. 38 మంది మృతి, 100కి పైగా గల్లంతు!
ఇకపై ప్రజలకు, సినిమా అభిమానులకు సందేశం, చారిత్రక నేపథ్యం ఉన్న సినిమాలకు మాత్రమే రాయితీలు, టిక్కెట్ల పెంపుదల కల్పించాలని డిమాండ్ చేశారు. పుష్ప-2 సినిమాలో ఎర్రచందనం స్మగ్లర్‌ను హీరోగా చూపించడంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి సినిమా కోసం ప్రజలపై భారం వేసి టికెట్ల రేట్లు పెంచినందుకు తెలంగాణ ప్రభుత్వమే మొదటి ముద్దాయి అని ఆయన ఫైర్ అయ్యారు. ఇందులో పోలీసుల తప్పేమీ లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ రోజుల్లో వేల రూపాయలు ఖర్చు చేసినా కుటుంబంతో కలిసి సినిమా చూడలేని పరిస్థితులు ఉన్నాయని నారాయణ అన్నారు.
Game Changer : నా ఫోన్లో రామ్ చరణ్ పేరును ‘ఆర్సీ ద కింగ్’ అని సేవ్ చేసుకున్న : ఎస్ జే సూర్య