Game Changer : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా డైరెక్టర్ శంకర్ తెరకెక్కించిన పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ ‘గేమ్ ఛేంజర్’. ఇందులో కియారా అద్వానీ కథానాయిక. నిర్మాత దిల్ రాజు ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మించారు. ఈ చిత్రం జనవరి 10న సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ అమెరికాలోని డల్లాస్ నగరంలో నిర్వహించింది చిత్ర యూనిట్. విదేశాల్లో ప్రీ-రిలీజ్ ఈవెంట్ నిర్వహించిన మొదటి తెలుగు సినిమా ఇదే. ఇంతకు ముందు ఏ భారతీయ చిత్రానికి జరగనంతగా అత్యంత వైభవంగా డల్లాస్‌లో ఈ వేడుక నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో అభిమానులు తరలివచ్చారు. రామ్ చరణ్ ఎంట్రీ సందర్భంగా, ఆడిటోరియం అభిమానుల హర్షధ్వానాలతో నిండిపోయింది. ‘స్టార్.. స్టార్.. గ్లోబల్ స్టార్’ అని నినాదాలు చేశారు. దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Read Also:PM Modi on Ravichandran Ashwin: అశ్విన్ భారత క్రికెట్‌కు చేసిన కృషి అద్భుతం: ప్రధాని మోడీ
I Saved his name as RC – THE KING – @iam_SJSuryah 🦁👑#GameChangerGlobalEvent #GameChangerpic.twitter.com/WwLZDhSmJt
— Team RamCharan (@AlwayzRamCharan) December 22, 2024
ఇందులో కీలక పాత్ర పోషించిన నటుడు ఎస్.జె. సూర్య, రామ్ చరణ్‌ను ప్రశంసలతో ముంచెత్తారు. ‘చిరంజీవి కుమారుడు రామ్ చరణ్ నిజంగా కింగ్. ఎందుకంటే ఆయన ప్రవర్తన, మనసు, ప్రవర్తన శైలి, నడక, నటన అన్నీ కింగ్ లా ఉంటాయి. నా మొబైల్‌లో ఆయన నంబర్ ‘ఆర్‌సి ది కింగ్’ అని సేవ్ చేసుకున్నాను. నాకు ఏది అనిపిస్తుందో నేను మాట్లాడతాను, రాస్తాను. ఆయనతో నటించడం నాకు చాలా సంతోషంగా ఉంది’ అని ఆయన అన్నారు.
Read Also:Nizamabad: బంగారు నాణేల పేరుతో రూ.7లక్షలు కాజేసిన కేటుగాడు..
ఇందులో రామ్ చరణ్ డ్యూయెల్ రోల్ చేస్తున్నాడు. రామ్ నందన్ అనే యువ ఐఏఎస్ అధికారిగా కనిపించడమే కాకుండా, ఆయన తన తండ్రి అప్పన్న పాత్రను కూడా పోషించారు. అంజలి, సముద్రఖని, సునీల్, శ్రీకాంత్, నాసర్, ఇతరులు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. థమన్ ఈ చిత్రానికి సంగీతం సమకూర్చారు.