NTV Telugu Site icon

KTR: రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఐదేళ్లు అధికారంలో ఉండాలని నేను కోరుకుంటున్నాను..

Ktr

Ktr

KTR: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎన్టీవీతో ఫేస్ టూ ఫేస్ లో మాట్లాడుతూ.. సొంత నియోజకవర్గం మీద కూడా పట్టు లేని నువ్వు అసలు ఏం ముఖ్యమంత్రి అని ప్రశ్నించారు. కేసీఆర్ అధికారంలోకి వచ్చాక భూముల ధరలు భారీగా పెరిగాయి.. రైతులకు ఆ భూములే ఆసరా అయ్యాయి.. అలాంటి భూములను గుంజుకుంటా అంటే వారికి కోపం రాదా?.. అధికారం పోయిందని నాకు ఎలాంటి ఫ్రస్ట్రేషన్ లేదు.. అసలు అధికారం వస్తుందని కలలో కూడా నేను ఊహించలేదు.. కానీ, 10 ఏళ్లు ప్రజలు మాకు అవకాశం ఇవ్వటాన్ని అదృష్టంగా భావించానని ఆయన అన్నారు. అలాగే, రేవంత్ రెడ్డి ప్రభుత్వం 5 ఏళ్ళు ఉండాలని నేను కోరుకుంటున్నాను.. వాళ్లు పూర్తి కాలం అధికారంలో ఉంటేనే కదా.. మళ్లీ బీఆర్ఎస్ పార్టీ 15 ఏళ్ల పాటు అధికారంలో ఉంటుందన్నారు. ఎన్నికల సంస్కరణాలు చేస్తే ఒక వ్యక్తి రెండు టర్ముల కన్నా ఎక్కువ సార్లు సీఎం, పీఎం ఉండొద్దని నేను విజ్ఞప్తి చేస్తానని కేటీఆర్ పేర్కొన్నారు.

Read Also: Jeff Bezos Marriage: అమెజాన్ వ్యవస్థాపకుడు రెండో పెళ్లి.. క్రిస్మస్ రోజున ప్రియురాలితో వివాహం

అలాగే, రాష్ట్రంలో మార్పు అనేది వచ్చింది.. కానీ అది మంచి మార్పు కాకుండా ప్రజలను ఇబ్బంది పెట్టే మార్పు అయ్యింది అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పారు. ఫార్మాసిటీ కోసం మేము సేకరించిన ల్యాండ్ అంతా కూడా కండిషనల్ ల్యాండ్.. ఆ భూమిని వేరే అవసరాలకు వాడటానికి వీలు లేదు.. కానీ రేవంత్ రెడ్డి హైకోర్టును కూడా తప్పుదోవ పట్టిస్తున్నాడు.. కోర్టులో ఫార్మాసిటీ ఉందంటాడు.. బయట రద్దైందని అంటాడు.. అసలు ఫోర్త్ సిటీ కోసం ఈ ప్రభుత్వం ఒక్క ఎకరాం ల్యాండ్ అయినా సేకరించిందా? అని ఆయన ప్రశ్నించారు. ఫార్మాసిటీ భూములతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలని చూస్తే ఊరుకోం.. ప్రజలను ఎప్పటికీ మోసం చేస్తామంటే కుదరదు.. నేను ఢిల్లీ కి పోయి కాంగ్రెస్ వాళ్ల మీద ఫిర్యాదు చేశా.. బీజేపీతో దోస్తీ మాకు అవసరం లేదు.. కానీ కాంగ్రెస్ వాళ్లు ఇక్కడ గల్లీల్లోనే బీజేపీతో చెట్టాపట్టాలేసుకొని తిరుగుతున్నారు అని ఆరోపించారు. రేవంత్ కి నేనంటే చాలా ప్రేమ ఉన్నట్లు ఉంది.. అందుకే నన్ను టార్గెట్ చేస్తున్నాడు అని కేటీఆర్ తెలిపారు.

Show comments