Hyderabad Marathon 2024: ప్రారంభమైన మారథాన్.. పాల్గొననున్న సీఎం రేవంత్..!
- హైదరాబాద్ రన్నర్స్ సొసైటీ ఆధ్వర్యంలో ఎన్ఎండీసీ హైదరాబాద్ మారథాన్ 2024..
- నెక్లెస్ రోడ్ నుంచి గచ్చిబౌలి వరకు జరిగే మారథాన్ ను జెండా ఊపి ప్రారంభించిన సీపీ శ్రీనివాస్ రెడ్డి..
- మారథాన్ లో విజయం సాధించిన వారికి సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా బహుమతులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hyderabad Marathon 2024: హైదరాబాద్ రన్నర్స్ సొసైటీ ఆధ్వర్యంలో ఎన్ఎండీసీ హైదరాబాద్ మారథాన్ 2024 13వ ఎడిషన్ ఈరోజు (ఆదివారం) లాంఛనంగా స్టార్ట్ అయింది. నెక్లెస్ రోడ్ పీపుల్స్ ప్లాజా నుంచి గచ్చిబౌలి బాలయోగి స్టేడియం వరకు ఈ మారథాన్ కొనసాగనుంది. ఫుల్ మారథాన్‌ను జెండా ఊపి హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి ఆరంభించారు. మారథాన్‌లో వివిధ దేశాలకు చెందిన రన్నర్లు కూడా పాల్గొన్నారు. ప్రతి ఏడాది నిర్వహించే ఈ మారథాన్ ఫిట్నెస్ అవేర్నెస్ పెంచేందుకు దోహదం చేస్తోందని చెప్పుకొచ్చారు. దేశంలోనే అతిపెద్ద రెండో మారథాన్ గా ఇది నిలుస్తుందన్నారు. 60, 70 ఏళ్లలో వచ్చే వ్యాధులు ఇప్పటి నుంచే యువత ఎదుర్కొంటుందని సీపీ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. కరోనా వచ్చిన తర్వాత ఆరోగ్యంపై ప్రజలు ఎక్కువగా శ్రద్ధ చూపిస్తున్నారు.. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలంటే తప్పనిసరిగా వ్యాయామం చేయాలని రన్నర్స్ సొసైట్ సూచించింది. ఈ మారథాన్‌లో దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలకు చెందిన రన్నర్స్ కూడా పాల్గొన్నారు.
Read Also: Kolkata Rape Case: సంజయ్ రాయ్ బైక్ పై కోల్‌కతా పోలీస్.. దీనిపై సీబీఐ విచారణ
Also Read
కాగా, ఈ మారథాన్‌ను హైదరాబాద్ నగరంలో ప్రతి సంవత్సరం ఘనంగా నిర్వహిస్తారు. ఈసారి సరికొత్తగా ఎన్ఎండీసీ మారథాన్‌ను స్టార్ట్ చేసింది. గత మంగళవారం ఈ మారథాన్‌కు సంబంధించిన ప్రణాళికను రిలీజ్ చేయగా.. ఈ కార్యక్రమంలో ఎన్ఎండీసీ చైర్మన్, మేనేజింగ్ డెరెక్టర్ అమితవ ముఖర్జీ, ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంకు హెడ్ బ్రాంచ్ బ్యాంకింగ్ సౌత్ నిరీశ్‌లలన్, ప్రముఖ బాక్సర్ నిఖత్ జరీన్ పాల్గొన్నారు. ముఖ్య అతిథులు మారథాన్‌కు సంబంధించిన టీషర్ట్, మెడల్స్ సైతం రిలీజ్ చేశారు. అయితే, ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా హాజరు కాబోతున్నారు. ఈ మారథాన్ లో గెలిచిన రన్నర్స్ కు ఆయన చేతుల మీదుగా బహుమతులను అందించనున్నారు.
తాజావార్తలు
-
Abhijeet Dipke Controversy: రామ మందిర CEOపై తప్పుడు వీడియో.. అభిజీత్ దీప్కేపై విమర్శలు..
-
Vaibhav Sooryavanshi: చిన్న వయసులోనే ఊహించని పాపులారిటీ.. వైభవ్ వైభవ్ అంటూ మాస్ మేనియా..
-
India Diesel Exports: రష్యా, అమెరికాను వెనక్కి నెట్టి.. యూరప్ డీజిల్ సరఫరాలో భారత్ టాప్
-
Nepal Earthquake: ఓ వైపు వరద విలయం.. నేపాల్‌లో భూకంపం..
-
Ishan Kishan: కాటేరమ్మ కొడుకు వీరవిహారం.. బౌలర్లను ‘శత’కొట్టిన ఇషాన్..
ట్రెండింగ్
-
Asia Cup 2026: భారత్ చేతిలో 55 పరుగులకే ఆలౌట్.. అయినా పాక్‌దే ఆసియా కప్ టైటిల్ అంటున్న కోచ్!
-
Harmanpreet Kaur History: హర్మన్‌ప్రీత్ కౌర్ నయా చరిత్ర.. క్రికెట్ హిస్టరీలోనే మొట్టమొదటి కెప్టెన్!
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!