CM Revanth Reddy: గుడి లేని ఊరు ఉంటుంది కానీ ఇందిరమ్మ కాలనీ లేని ఊరు లేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇవాళ సచివాలయంలో ఇందిరమ్మ ఇళ్ల సర్వే మొబైల్ అప్లికేషన్‌ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి, జూపల్లి, పొన్నం పాల్గొన్నారు. సీఎం మాట్లాడుతూ.. ఒక్కో నియోజకవర్గానికి 3,500 ఇళ్లు పంపిణీ చేయనున్నారని తెలిపారు. గ్రామసభల ద్వారా లబ్ధిదారుల ఎంపిక ఉంటుందన్నారు. మహబూబ్‌నగర్, నిజామాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, మెదక్ జిల్లాల్లో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేయనున్నట్లు వెల్లడించారు. ఇతర రాష్ట్రాలు తెలంగాణ రైజింగ్ అనుకునేలా రాష్ట్ర ప్రభుత్వం కార్యక్రమాలు చేపడుతోందన్నారు. ఇందిరమ్మ కూడు, గూడు, గుడ్డ ప్రతీ వారికి అందించాలని నినాదించారని సీఎం తెలిపారు.
Read also: Konda Surekha: కౌశిక్ రెడ్డిపై కొండా సురేఖ ఘాటు వ్యాఖ్యలు..
కొద్ది మంది గుప్పిట్లో బందీ అయిన భూములను సీలింగ్ యాక్ట్ తెచ్చారన్నారు సీఎం రేవంత్. రూ.25 లక్షల ఎకరాలు దళితులకు, రూ.10 లక్షల ఎకరాలు గిరిజనులకు తెలంగాణలో ఇచ్చారన్నారు. గ్రామాల్లో ఎస్సి, ఎస్టీలకు ఉన్న భూమి.. వారి తల్లిదండ్రులు ఇచ్చింది కాదు… ఇందిరమ్మ ఇచ్చిందన్నారు. గుడి లేని ఊరు ఉంటుంది కానీ, ఇందిరమ్మ కాలనీ లేని ఊరు లేదని సీఎం అన్నారు. చిట్టడవిలో కూడా ఇందిరమ్మ ఇండ్లు ఉన్నాయని తెలిపారు. రూ.10 వేల రూపాయల ఆర్థిక సహాయంతో మొదలై వైఎస్ హయాంలో లక్షా 25 వేలకు పెరిగిందన్నారు. ఇప్పుడు ప్రతీ ఇందిరమ్మ ఇంటికి రూ.5 లక్షల ఆర్థిక సహాయం చేసున్నాం అన్నారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం కోసం బ్యాంకుల నుంచి లోన్ తీసుకున్నామన్నారు. రూ.7 వేల మందికి రుణ విముక్తులను చేస్తున్నామని తెలిపారు.
Read also: Salman Khan: సిద్ధిక్ హత్యకు ముందే సల్మాన్‌ను చంపాలని స్కెచ్!
ఆర్టిఫిషల్ ఇంటలిజెన్స్ ద్వారా ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం ఉంటుందన్నారు. గత ప్రభుత్వం రద్దు చేసిన గృహ నిర్మాణ శాఖను పునరుద్ధరణ చేసి… కావలసిన అధికారులను నియమిస్తున్నామని సీఎం అన్నారు. అర్హులైన వారికే ఇందిరమ్మ ఇండ్లు… ఏ ఒక్క అనర్హుడికి ఇండ్లు ఇవ్వమన్నారు. రూ.4 లక్షల 50 వేల ఇండ్లు ఈ సంవత్సరం పూర్తి చేస్తామన్నారు. మొత్తంగా 25 లక్షల ఇండ్లు పూర్తి చేస్తామన్నారు. ఇది నిజంగా ఒక పండుగ.. ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అంటారు. మేము ఇల్లు కట్టించే భాద్యత తీసుకున్నామన్నారు. ఇంట్లో వాళ్ళు పెళ్లి చేసే భాద్యత తీసుకోవాలన్నారు. ప్రాధాన్యత క్రమంలో ఇండ్ల నిర్మాణం జరుగుతుందని రేవంత్ రెడ్డి తెలిపారు.
Read also: Ponnam Prabhakar: చంచల్ గూడ జైల్లో దీక్షాంత్ పరేడ్ కార్యక్రమం.. పాల్గొన్న మంత్రి పొన్నం
ఆదివాసీ గుడాల్లో నేను, భట్టి తిరిగి వచ్చామని తెలిపారు. వాళ్ళు మాకు అనేక సమస్యలు చెప్పుకున్నారని సీఎం తెలిపారు. ఐటిడిఎ ప్రాంతాల్లో అదనంగా ఇండ్లు మంజూరు చేస్తామన్నారు. ఆదివాసీలకు ప్రత్యేక కోటా ఉంటుందన్నారు. వారికి ప్రత్యేక ప్యాకేజి ఉంటుందని తెలిపారు. అచంపేట ఆదివాసీలను కేసీఆర్ ప్రభుత్వం మనుషులుగా గుర్తించ లేదన్నారు. ఇంద్రవెళ్లి బాధితులకు ఇందిరమ్మ ఇండ్లు నేనే స్వయంగా ఇచ్చామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
Revenue Sadassulu: రేపటి నుంచి రెవెన్యూ సదస్సులు.. చిన్న గ్రామాల్లో ఒక పూట, పెద్ద గ్రామాల్లో రోజంతా..