CM Revanth Reddy: హుస్సేన్‌సాగర్ వద్ద నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించిన సీఎం రేవంత్..
- ట్యాంక్‌బండ్ వద్ద సీఎం రేవంత్ రెడ్డి..
- గణేష్ నిమజ్జన కార్యక్రమంలో పాల్గొననున్న సీఎం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Revanth Reddy: ఖైరతాబాద్‌లోని గణనాథుడు ట్యాంక్‌బండ్ వద్ద హుస్సార్ సాగర్‌లోని గంగమ్మ ఒడ్డుకు చేరుకోనుంది. గణేష్ నిమజ్జన కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు. ఇప్పటికే ఆయన సచివాలయం నుంచి కాలినడకన ట్యాంక్ బండ్ కు చేరుకున్నారు. గణేష్ నిమజ్జన ప్రాంతాన్ని పరిశీలించారు. నిమజ్జన క్రేన్స్ వద్ద పరిస్థితులను సీఎం రేవంత్ రెడ్డి పరిశీలించారు. క్రేన్ డ్రైవర్స్, ఇతర సిబ్బంది అప్పుడప్పుడు విశ్రాంతి తీసుకునేందుకు ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. మూడు షిఫ్టుల్లో డ్రైవర్స్ ,ఇతర సిబ్బందికి విధులు కేటాయించేలా జాగ్రత్తలు తీసుకోవాలని ఆశించారు. ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు.
నిమజ్జనం ప్రక్రియ ముగిసే వరకు అందరూ సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. ఎప్పటికపుడు పరిస్థితులను అంచనా వేస్తూ అలెర్ట్ గా ఉండాలని పోలీస్ యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. మరికాసేపట్లో ఖైరతాబాద్ గణసుడు ట్యాంక్ బండ్ క్రేన్ నంబర్ 4కు చేరుకోనుంది. బొజ్జగణపతి నిమజ్జనానికి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు అధికారులు పూర్తి చేశారు. ప్రస్తుతం ఖైరతాబాద్ నుంచి బయల్దేరిన మహా గణపయ్య శోభాయాత్ర లక్డీకపూల్ మీదుగా సచివాలయం వైపు సాగుతోంది. వేలాది మంది భక్తుల నడుమ శోభాయాత్ర ముందుకు సాగుతోంది. దీంతో పోలీసులు కార్యదర్శి వైపు నుంచి ట్యాంక్ బండ్ వైపు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. సీఎం వెంట పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్, ఎమ్మెల్యే దానం నాగేందర్, జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి తదితరులు ఉన్నారు.
Ganesh Immersion Live Updates: ఘనంగా గణేష్ నిమజ్జన వేడుకలు.. లైవ్ అప్డేట్స్
Also Read
తాజావార్తలు
-
TVS 160cc Maxi Scooter: టీవీఎస్ 160cc మ్యాక్సీ స్కూటర్.. యమహా ఏరాక్స్, హీరో జూమ్‌లకు గట్టి పోటీ
-
Rajya Sabha Candidates: టీడీపీ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు.. చివరి నిమిషంలో చింతకాయల విజయ్ పేరు ఖరారు!
-
Sai Durgha Tej : సాయి దుర్గ తేజ్ నెక్ట్స్ సినిమా టైటిల్ ‘పార్వేట’
-
India U18 Hockey Asia Cup Champion: జపాన్‌పై ఘన విజయం.. అండర్-18 హాకీ ఆసియా కప్ ఛాంపియన్‌గా భారత్
-
Horoscope Today: ఆదివారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి ఉద్యోగ, వ్యాపారాల్లో అభివృద్ధి!
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!