CM Revanth Reddy: ప్రముఖ సినీ నటుడు కోట శ్రీనివాసరావు మృతి పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంతాపం ప్రకటించారు. విలక్షణ నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న కోట శ్రీనివాసరావు మృతి సినీ రంగానికి తీరని లోటని తెలిపారు. కోట శ్రీనివాసరావు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు సీఎం. అలాగే, నటుడు కోటా శ్రీనివాసరావు మృతి పట్ల మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర ద్రిగ్బాంతి వ్యక్తం చేశారు.750కి పైగా సినిమాల్లో విలక్షణమైన పాత్రల్లో తన నటనతో అలరించాలని గుర్తు చేసుకున్నారు. కోట శ్రీనివాసరావు మృతి సినీ లోకానికి తీరని లోటని అన్నారు. ఆయన చేసిన పాత్రలు సమాజంలో మార్పు తెచ్చేలా ఉండేవని పేర్కొన్నారు. కోట శ్రీనివాసరావు మృతి పట్ల మంత్రి పొన్నం ప్రభాకర్ సంతాపాన్ని వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకు, అభిమానులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
Read Also: KOTA : రాజకీయాల్లోను ‘కోట’ ముద్ర.. ఎక్కడ నుండి ఎమ్మెల్యేగా గెలిచారో తెలుసా.?
మరోవైపు, నటుడు కోటా శ్రీనివాసరావు మృతి పట్ల తెలంగాణ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కోటా శ్రీనివాసరావు మృతి బాధాకరం.. ఆయన మరణం నన్ను వ్యక్తిగతంగా కలిచి వేసిందన్నారు. నాలుగు దశాబ్దాల సినీ ప్రయాణంలో ఎన్నో విలక్షణ పాత్రలను ఆయన పోషించారు.. ఆయన ప్రతిభకు గుర్తింపుగా పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్న గొప్ప నటుడు.. 9 నంది పురస్కారాలు అందుకున్న కోటా.. శాసన సభ్యునిగా ప్రజా సేవలో నిమగ్నం అయ్యారని చెప్పుకొచ్చారు. ఆయన సినీ ప్రయాణంలో పిసినారిగా పొట్ట చెక్కలయ్యేలా నవ్విస్తూనే, విలన్ గా ముచ్చెమటలు పట్టించి అన్ని వర్గాల ప్రజల ప్రజలను మెప్పించాడని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు.