CM Revanth Reddy: ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రపంచవ్యాప్తంగా ఒకేసారి జరుపుకునే పండుగగా క్రిస్మస్.. ద్వేషించే వారికి కూడా ప్రేమించే గుణాన్ని ఏసు ప్రభువు మానవాళికి స్ఫూర్తిగా అందించారని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీకి కూడా డిసెంబర్ ఒక మిరాకిల్ మంత్‌గా మారిందని వ్యాఖ్యానించారు. రాజకీయంగా భారీ మూల్యం చెల్లించి, ఆంధ్రప్రదేశ్‌లో పార్టీకి నష్టం జరిగినప్పటికీ సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ప్రసాదించారని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.
Read Also: Tata Motors 2026 Cars: కొత్త సంవత్సరంలో టాటా మోటార్స్ లాంచ్ చేసే కార్లు ఇవే!
అయితే, గతంలో సోనియా గాంధీ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్‌ను తీసుకొచ్చి పేదలకు భరోసా కల్పించారని సీఎం రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. ఈరోజు తెలంగాణలో తమ ప్రభుత్వం పేదలకు దొడ్డు బియ్యం స్థానంలో సన్న బియ్యం అందిస్తున్నామని తెలిపారు. అలాగే, విద్య, వైద్యం లాంటి కీలక సేవలను ప్రభుత్వంతో సమానంగా క్రిస్టియన్ మిషనరీలు కూడా పేదలకు అందిస్తూ, సమాజ సేవలో కీలక పాత్ర పోషిస్తున్నాయని ముఖ్యమంత్రి ప్రశంసించారు. క్రిస్మస్ పండుగ ప్రేమ, సేవ, త్యాగాలకు ప్రతీకగా నిలుస్తుంది.. ఆ విలువలను ప్రతి ఒక్కరూ అనుసరించాలని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.