Chain Snatchig: సంగారెడ్డి జిల్లా పటాన్ చెరులో చైన్ స్నాచింగ్ కలకలం రేపింది. ఓ మహిళ తెల్లవారు జామున తులసి చెట్టుకు పూజ చేస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.
సంగారెడ్డి జిల్లా పటాన్ చెరులోని శాంతినగర్ కాలనీలో కార్తీక మాసం కావడంతో సోమలక్ష్మి అనే మహిళ ఉదయం లేచి ఇంటి ముందు తులసి చెట్టుకు పూజ చేస్తుంది. దీనిని గుమనించిన ఇద్దరు దుండగులు బైక్ పై వచ్చారు. ఆ కాలనీలో ఎవరూ లేరని గ్రహించారు. ఒకరు బైక్ పై కూర్చొని వుండగా.. మరొకడు పూజ చేస్తున్న సోమలక్ష్మి వద్దకు వెళ్లి మెడలోంచి పుస్తెల తాడు లక్కొని పరుగులు పెట్టారు. సోమలక్ష్మి అరుపులకు కొందరు స్థానికులు అక్కడకు వచ్చారు. అయితే దుండగులు ఇద్దరు అక్కడి నుంచి పరార్ అయ్యారు. ఇద్దరు దుండగులు ముఖం గుర్తుపట్టకుండా ఒకరు మాస్క్ వేసుకుని వుండగా, మరొకరు హెల్మెట్ పెట్టుకుని ఉన్నాడని స్థానికులు తెలిపారు. సోమలక్ష్మి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. శాంతినగర్ కాలనీకి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సీసీ ఫుటేజీ పరిశీలిస్తున్నారు. ఇద్దరు దుండగులు మాస్క్, హెల్మెట్ ధరించడంతో బైక్ నెంబర్ ఆధారంగా గాలింపు చర్యలు చేపట్టారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
Read also: Koti Deepotsavam 2024: కార్తీక ఆదివారం వేళ.. కోటి దీపోత్సవంలో 9వ రోజు కార్యక్రమాలు ఇవే!
మరోవైపు నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని పర్కెట్ లో దొంగల హల్చల్ సృస్టించారు. రాత్రి ఆసుపత్రికి వెళ్లి వచ్చేలోపే ఇల్లు గుల్ల చేశారు. తాళం పగలగొట్టి, ఇంట్లో చొరబడి 12 తులాల బంగారం, 30 తులాల వెండి, 50 వేల నగదు తీసుకుని ఉడాయించారు. బాధితులు పోలీసులకు సమాచారంతో ఘటన వద్దకు చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Mahavatar : మరో భారీ ప్రాజెక్ట్ కు శ్రీకారం చుట్టిన హోంబలే ఫిల్మ్స్