పిల్లుల దత్తతను ప్రోత్సహించే లక్ష్యంతో, మార్స్ పెట్‌కేర్, వెట్స్ సొసైటీ ఫర్ యానిమల్ వెల్ఫేర్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్ (వీఎస్‌ఏడబ్ల్యూఆర్‌డీ)తో కలిసి ఆదివారం నగరంలో క్యాట్ షోను నిర్వహించింది. ఈ కార్యక్రమంలో 80కి పైగా పిల్లుల పాల్గొన్నాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పశుసంవర్థక శాఖ డైరెక్టర్ రాంచందర్ హాజరయ్యారు. అయితే వేదిక వద్ద ఉచిత ఆరోగ్య శిబిరం మరియు ఇండీ క్యాట్ దత్తత డ్రైవ్ కూడా నిర్వహించారు.
ఫెలైన్ క్లబ్ ఆఫ్ ఇండియాచే నిర్వహించబడిన ఈ ఈవెంట్, జంతు ప్రేమికులకు పిల్లులను దత్తత తీసుకోవడానికి ఒక వేదికగా నిలిచింది. ఈ సందర్భంగా మార్స్ పెట్‌కేర్ ఇండియా జనరల్ మేనేజర్ గణేష్ రమణి మాట్లాడుతూ, “క్యాట్ షో 2021’ అనేది పిల్లి ప్రేమికులను ఒకచోట చేర్చి, ప్రజలలో పిల్లుల దత్తతను జరుపుకోవడానికి, ప్రోత్సహించడానికి ఒక వేదిక అని అన్నారు. వీఎస్‌ఏడబ్ల్యూఆర్‌డీ వంటి సంస్థలతో కలిసి ఈ పెంపుడు జంతువులపై మరింతగా అవగాహన కల్పించేందుకు మరిన్ని కార్యక్రమాలు చేపడుతామని అన్నారు.