Old City of Hyderabad: పాతబస్తీలో దారుణం.. అన్నను బండరాయితో మోది చంపిన తమ్ముడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Old City of Hyderabad: హైదరాబాద్ పాతబస్తీ చాంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. ఇంద్రా నగర్ లో ఆంజనేయులును అతని తమ్ముడు సురేష్ కుమార్ బండ రాయితో తలపై మోదీ హత్య చేశాడు. స్థానిక సమాచారంతో ఘటనాస్థలికి చాంద్రాయణగుట్ట సిఐ ప్రసాద్ వర్మ వారి సిబ్బందితో కలిసి చేరుకొని క్లూస్ టీం ను రప్పించి ఆధారాలు సేకరించారు. తమ్ముడు సురేస్ ను అదుపులో తీసుకున్నారు. మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసుకొని చాంద్రాయణగుట్ట పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు సురేష్ కుమార్ కొద్దీ కాలంగా మానసిక స్థితి సరిగ్గా లేదని మృతుడి, నిందితుడి తల్లి తెలిపింది. తాజాగా నిందితుడు అతని వదినపై కూడా దాడి చేస్తూ పిచ్చిగా ప్రవర్తించాడని స్థానికులు పోలీసులకు తెలిపారు. ఘటన స్థలాన్ని ఏసీపీ ఫలక్ నుమా షేక్ జహంగీర్ పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. నిందితుడు మానసిక స్థితి
సరిగా లేదని అతన్ని అదుపులో తీసుకున్నామని అన్నారు.
Also Read
తాజావార్తలు
-
‘The Hundred’లో రోహిత్ శర్మ.! MI లండన్ ఘన విజయం.!
-
Trump 200% Tariff: ట్రంప్ సంచలన నిర్ణయం.. జెనరిక్ మందులపై 200% టారిఫ్.. భారత ఫార్మా పరిశ్రమపై భారీ ప్రభావం?
-
AP Coronavirus Cases: ఏపీలో భయపెడుతోన్న కరోనా..! పర్యాటకులపై ఆంక్షలు
-
NBK : ట్రీట్మెంట్ కోసం హైదరాబాద్‌కు బాలయ్య.. షూటింగ్ కు బ్రేక్
-
India Test Squad: శ్రీలంకతో టెస్టు సిరీస్.. టీమిండియాలోకి మరో కొత్త ప్లేయర్!
ట్రెండింగ్
-
10 రోజుల బ్యాటరీ, 80+ స్పోర్ట్స్ మోడ్లు.! స్క్రీన్ లేకుండానే హెల్త్ ట్రాకింగ్.. Garmin CIRQA స్మార్ట్ బ్యాండ్ లాంచ్.!
-
OLED డిస్ప్లే, RTX 5090 GPUతో పవర్ఫుల్ పనితీరుతో Dell కొత్త Alienware గేమింగ్ ల్యాప్‌టాప్‌లు లాంచ్..! ఫీచర్స్, ధరలు ఇలా..!
-
Best Camera Phones: DSLRకు పోటీగా ఫొటోగ్రఫీ అనుభవం..! బెస్ట్ కెమెరా ఫోన్ల లిస్ట్ ఇదిగో..!
-
Cleaning Hacks : తుప్పు పట్టిన ఇనుప అల్మారా కొత్తదానిలా మెరవాలా? ఈ 4 చిట్కాలు చాలు.!
-
Remote Cleaning : వర్షాల్లో టీవీ రిమోట్ పనిచేయడం లేదా? ఈ 4 ట్రిక్స్‌తో కొత్తదానిలా మారుతుంది.!