Hyderabad: ఇందిరా పార్క్‌లో ఆటో డ్రైవర్ల మహాధర్నా..
- ఇందిరా పార్క్‌లో ఆటో డ్రైవర్ల మహాధర్నా..
- తమను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్..
- ఏడాదికి రూ. 12వేలు ఇవ్వాలని డిమాండ్ చేసిన ఆటో డ్రైవర్లు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hyderabad: ఇందిరా పార్క్‌లో ఆటో డ్రైవర్ల మహాధర్నా కార్యక్రమం కొనసాగుతుంది. రేవంత్ రెడ్డి సర్కార్ తీసుకొచ్చిన ఫ్రీ బస్సు కారణంగా నష్టపోతున్న ఆటో డ్రైవర్లను ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఆటో, ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ జేఏసీ ఆధ్వర్యంలో మహా ధర్నా నిర్వహిస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్ నగర వ్యాప్తంగా దాదాపు 2 లక్షల మంది ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నారు. మహా లక్ష్మి స్కీమ్ కు ముందు యావరేజ్ గా 1000 రూపాయలు సంపాదన ఉంటే.. ఇప్పుడు 500 కూడా సరిగ్గా రావడం లేదు అని ఆటో డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం సంవత్సరానికి 12 వేల రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చింది.. అది అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఆటో, రవాణా రంగ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలన్నారు. యాప్ లతో అనుమతి లేకుండా నడుస్తున్న టూ విలర్లను నిషేధించాలని కోరారు. ప్రమాద బీమాను రూ. 10 లక్షలకు పెంచి.. సాధారణ మరణాలకు వర్తింప చేయాలని ఆటో డ్రైవర్లు, ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ జేఏసీ డిమాండ్ చేసింది.
Also Read
- Cheyutha Pension : చేయూత పింఛన్‌కు రేపే డెడ్‌లైన్.. మిస్ అయితే కష్టమే.!
- Harish Rao : రూ.500 కోట్ల భూమి రూ.87 కోట్లకేనా.?రేవంత్‌కు హరీశ్ రావు లేఖ..!
- TG SAFE: ఫుడ్ లవర్స్ అలర్ట్.. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న చట్నీస్, పిస్తా హౌస్ సహా ఈ 7 రెస్టారెంట్లు!
- TG EAPCET: తెలంగాణ ఎప్‌సెట్ (Bi.P.C) కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల.. పూర్తి వివరాలు ఇవే..
మరోవైపు ఆటో, ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ డ్రైవర్ల మహాధర్నాకి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాకపై సందిగ్ధం నెలకొంది. ఈ ధర్నాలో సీఐటీయూ, ఏఐసీయూటీ, బీఆర్టీయూ, టీయూసీఐ, జీయూసీఐ, యూటీఏడీడబ్ల్యూఏ, టీఏడీఎస్ లాంటి సంఘాలు పాల్గొన్నాయి. కానీ, బీఆర్టీయూ సంఘం కేటీఆర్ నీ జేఏసీకి తెలియకుండా స్వాగతించారని.. మిగితా సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేసినట్టు సమాచారం. దీంతో కేటీఆర్ రావడంపై నాయకులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
తాజావార్తలు
-
Pak Spy Network Busted: మేడ్ ఇన్ చైనా కెమెరాలు, పాక్‌కు లైవ్.. ఐఎస్ఐ గూఢచారి అరెస్ట్..
-
Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Uttar Pradesh: యూపీలో హిందూ లీడర్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్ హత్య..
-
North Cyprus: ఘోర ప్రమాదం.. సముద్రంలో ఫెర్రీ బోల్తా.. 270 మంది ఉన్నట్లు సమాచారం
ట్రెండింగ్
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!