లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీపై మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శలు గుప్పించారు. రాహుల్‌గాంధీ సినిమా యాక్టర్ల కంటే ఎక్కువగా యాక్టింగ్ చేశారని వ్యాఖ్యానించారు. ఆటో డ్రైవర్ల సమస్యలను పరిష్కరించాలని బీఆర్ఎస్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో ఆందోళన చేపట్టారు. ఎర్రగడ్డలో హరీశ్‌రావు ఆటో డ్రైవర్లను కలిసి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
ఆటో డ్రైవర్లకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. విజయవాడ, విశాఖ నగరాల్లో ఆటో రిక్షాల పరిమితిని ఎత్తివేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. బీఎస్ 6, సీఎన్జీ, పెట్రోల్, ఎల్పీజీ, ఈవీ ఆటోల సంఖ్యపై పరిమితిని ఎత్తివేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ప్రజా రవాణాలో భాగంగా లాస్ట్ మైల్ కనెక్టివిటీ కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఏపీ ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కోన్నది. గతంలో విజయవాడ నగరంలో 8,700 ఆటో రిక్షాలు, విశాఖలో 8,400 ఆటో రిక్షాలకు…
Hyderabad: ఇందిరా పార్క్‌లో ఆటో డ్రైవర్ల మహాధర్నా కార్యక్రమం కొనసాగుతుంది. రేవంత్ రెడ్డి సర్కార్ తీసుకొచ్చిన ఫ్రీ బస్సు కారణంగా నష్టపోతున్న ఆటో డ్రైవర్లను ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఆటో, ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ జేఏసీ ఆధ్వర్యంలో మహా ధర్నా నిర్వహిస్తున్నారు.
రాష్ట్రంలోని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆటో డ్రైవర్లను విస్మరించిందని చేవెళ్ల బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఆరోపించారు. సోమవారం రాజేంద్రనగర్ నియోజకవర్గం శంషాబాద్లోని వైఎన్ఆర్ గార్డెన్స్లో భారతీయ మజ్దూర్ యూనియన్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఆటో డ్రైవర్లు, లైట్ వెయిట్ మోటార్ వెహికల్ డ్రైవర్లతో ఆయన సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా కొండా విశ్వేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఆటో డ్రైవర్ల కోసం ప్రతి నెల జీవన భృతి కల్పిస్తామని చెప్పి మాట తప్పిందని…
Auto Drivers: ఇటీవల తెలంగాణలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రేవంత్ రెడ్డి పలు సంచలన నిర్ణయాలు తీసుకుంటూ తనదైన ముద్ర వేస్తున్నారు.
సీఎం రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బహిరంగ లేఖ రాశారు. ఆటో డ్రైవర్ల సమస్యపై తన లేఖలో ప్రస్తావించారు. ఆటో డ్రైవర్ సోదరులను కాంగ్రెస్ ప్రభుత్వం ఆదుకోవాలని తెలిపారు. ఆటోడ్రైవర్ల ఆత్మహత్యలకు వెంటనే అడ్డుకట్ట వేయాలని పేర్కొన్నారు. ఆటోలకు గిరాకీ లేకపోవడంతో కుటుంబాలను ఎలా పోషించుకోవాలో తెలియక ఇటీవలి కాలంలో ఏకంగా 15 మంది ఆటోడ్రైవర్లు రాష్ట్రవ్యాప్తంగా ఆత్మహత్యలు చేసుకున్నారంటే.. పరిస్థితి ఎంత చేజారిపోయిందో అర్థమైపోతోందన్నారు. ఆటోలు ఎక్కేవాళ్లు లేకపోవడంతో తమ కుటుంబం గడవని…
ఇవాళ సాయంత్రం 4 గంటలకు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో సిఎం రేవంత్ రెడ్డి సమావేశం కానున్నట్లు సమాచారం. ఆటో, ఊబర్ వాహానాల డ్రైవర్లతో సమావేశం అయ్యే అవకాశం ఉంది.
రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఆటో కార్మికుల నిరసన, భారీ ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా సిరిసిల్ల పట్టణం కొత్త బస్టాండ్ నుంచి కలెక్టరేట్ కార్యాలయం వరకు 8 వందలకు పైగా ఆటోలతో భారీ ర్యాలీ, నిరసన చేపట్టారు.
BMS Auto Union: ఆర్టీసీ ఉచిత బస్సు సర్వీస్ వల్ల ఆటో డ్రైవరలకు తీవ్ర నష్టం జరుగుతుందని బీఎంఎస్ ఆటో యూనియన్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 70 శాతం మహిళలు ఆటోల్లో ప్రయాణిస్తారని అన్నారు.
రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఆటో డ్రైవర్లు ధర్నా చేపట్టారు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ఆటో యూనియన్ ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్లు రాస్తారోకో చేశారు. మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని వెంటనే రద్దు చేయాలంటూ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో.. అక్కడ భారీగా ట్రాఫిక్ జామ్ అయింది.