Arekapudi Gandhi: కౌశిక్ రెడ్డి కోసం తన ఇంటి ముందు అరికాపూడి గాంధీ కుర్చీ వేసుకుని కూర్చున్నారు. కౌశిక్ రెడ్డి ఇళ్లు నా నియోజక వర్గంలో ఉంది…వానికి కష్టాలు వస్తే నేను ఆదుకున్న అన్నారు. ఉదయం 11 గంటలు అవుతుంది కౌశిక్ రెడ్డి రాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కౌశిక్ రెడ్డి రాలేదు కాబట్టి నేను 12 గంటలకు కౌశిక్ రెడ్డి ఇంటికి వెళుతానని అన్నారు. నన్ను ఎవరు అడ్డుకున్న నేను కౌశిక్ రెడ్డి ఇంటికి వెళుతానని తెలిపారు. నాకు పదవి రావడం కొందరు ఓర్చుకోలేక పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కౌశిక్ రెడ్డి మాటలను brs నేతల దృష్టి కి తీసుకు వెళ్ళానని తెలిపారు. కౌశిక్ రెడ్డి నీ హౌజ్ అరెస్ట్ చేయలేదు.. కౌశిక్ రెడ్డి ఇంటి ముందు ఎవరు లేరని అన్నారు. కౌశిక్ రెడ్డి లాంటి దుర్మార్గుల వలన పార్టీ ప్రతిపక్ష పోజిషియన్ లోకి వెళ్ళిందన్నారు. దీంతో పాడి కౌశిక్ రెడ్డి ఇంటి ముందు హై టెన్షన్ వాతావరణం నెలకొంది. ముందస్తుగా పోలీసులు భారీగా మొహరించారు.
Read also: Rachakonda: కూతురుకి మొదటి సెల్యూట్ చేస్తూ తండ్రి భావోద్వేగం..
కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ.. ఈరోజు ఉదయం ఎమ్మెల్యే గాంధీ ఇంటికి వెళ్తానంటే భయంతో నన్ను పోలీసులు హౌస్ చేశారు. ఎమ్మెల్యే గాంధీకి సుటిగా ప్రశ్నిస్తున్నాను.. మీరు టిఆర్ఎస్ పార్టీని విడిచి కాంగ్రెస్ పార్టీ లోకి చేరా లేదా అనేది సూటిగా సమాధానం చెప్పాలన్నారు. మీరు టిఆర్ఎస్ పార్టీలో ఉన్న అంటేనే నేను మీ ఇంటికి వస్తాఅని తెలిపారు. మీరు టిఆర్ఎస్ పార్టీ మారనప్పుడు టిఆర్ఎస్ జండా పెట్టుకోవడానికి మీకు ఎలాంటి అభ్యంతరం అని ప్రశ్నించా? అని తెలిపారు. ఎమ్మెల్యే గాంధీ ప్రెస్ మీట్ పెట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి కాంగ్రెస్ పార్టీలోకి వేళ్లలేదు అనడం ఎంతవరకు కరెక్ట్ అన్నారు. బ్రోకర్ కౌశిక్ రెడ్డి అని ఎమ్మెల్యే అన్నారు. బ్రోకర్ నువ్వా నేనా ప్రజలు గమనస్తున్నారని తెలిపారు. గతంలో చంద్రబాబు పార్టీలో కలిసి బీఆర్ఎస్ లోకి వచ్చి బిఆర్ఎస్ లో గెలిచి కాంగ్రెస్లోకి వెళ్లి పూటకొక పార్టీ మారి బ్రోకర్ గిరి చేసేది నువ్వు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. నీకు దమ్ముంటే నువ్వు మగాడివైతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్లీ పోటీ చేసే గెలువు అని సవాల్ విసిరారు. నేను నీకంటే ఎక్కువ మాట్లాడగలుగుతా కానీ నీ విజ్ఞతకే వదిలేస్తున్నా అన్నారు. అరికెపూడి గాంధీ నేను కాంగ్రెస్ పార్టీలో చేరలేను నేను బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేనే అని అన్నారు. అందుకే అతని ఇంటికి వెళ్తామని అన్నాను. మీ రేవంత్ రెడ్డిని అడుగు పిసిసి చీఫ్ అవ్వడానికి కౌశిక్ రెడ్డి ఎలాంటి సహాయం చేశాడు అని కీలక వ్యాఖ్యలు చేశారు.
Kaushik Reddy: నాకు 39, నీకు 7ం ఏండ్లు.. నేను రెచ్చిపోతే ఎట్లా ఉంటదో చూసుకో..