Allu Arjun Live Updates: పుష్ప -2 రిలీజ్ సందర్భంగా సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన కేసులో హీరో అల్లు అర్జున్‌కు చిక్కడపల్లి పోలీసులు సోమవారం నోటీసులు ఇచ్చారు. ఇక, ఈరోజు ఉదయం 11 గంటలకు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లో విచారణకు అల్లు అర్జున్ హాజరయ్యారు. అయితే, పోలీసుల ప్రశ్నలకు అల్లు అర్జున్ ను ఎలాంటి సమాధానం ఇస్తున్నారనే దానిపై తీవ్ర ఉత్కంఠత కొనసాగుతుంది. మీ కోసం ఎన్టీవీ లైవ్ అప్డేట్స్..
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో చిక్కడపల్లి పీఎస్‌లో విచారణ అనంతరం అల్లు అర్జున్ జూబ్లీహిల్స్‌లోని తన ఇంటికి చేరుకున్నారు.
హైదరాబాద్: చిక్కడపల్లి పీఎస్‌లో అల్లు అర్జున్ విచారణ పూర్తి.. చిక్కడపల్లి పీఎస్ నుంచి బయటకు వచ్చిన అల్లు అర్జున్.. ఎవరితో మాట్లాడకుండానే కారులో వెళ్లిపోయిన అల్లు అర్జున్.
సంధ్య థియేటర్ ఘటనలో ప్రధాన నిందుతుడు అరెస్ట్.. తొక్కిసలాటకు ప్రధాన కారకుడు బౌన్సర్ ఆంటోనిగా గుర్తింపు.. బౌన్సర్లకు ఆర్గనైజర్‌గా పనిచేస్తున్న ఆంటోని.. ఎక్కడ ఈవెంట్ జరిగినా బౌన్సర్లకు ఆర్గనైజర్‌గా ఆంటోని
సంధ్య థియేటర్ దగ్గర తొక్కిసలాట జరిగిన 10 నిమిషాల వీడియోను అల్లు అర్జున్ కి చూపిన విచారణ అధికారులు..
చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లో అల్లు అర్జున్ విచారణ పూర్తి.. పీఎస్ వద్ద అలర్ట్ అయిన పోలీసులు.. కాసేపట్లో పీఎస్ నుంచి బయటకు అల్లు అర్జున్ రానున్నారు.. అల్లు అర్జున్ వాహనాలతో పాటు పోలీసుల వాహనాలు సిద్ధం చేస్తున్న సిబ్బంది.. దాదాపు రెండున్నర గంటల పాటు అల్లు అర్జున్ ను ప్రశ్నించిన పోలీసులు..
చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌లో కొనసాగుతున్న అల్లు అర్జున్ విచారణ.. తొక్కిసలాటలో రేవతి చనిపోయిన విషయం మీకు తెలుసు కదా అని ప్రశ్నించిన పోలీసులు.. నోరు మెదపని అల్లు అర్జున్.. తర్వాత రోజు వరకు తనకు తెలియదని మీడియాకు ఎందుకు చెప్పారని ప్రశ్నించిన పోలీసులు.. ఈ ప్రశ్నకు కూడా సైలెంట్‌గానే ఉన్న బన్నీ.
* సంధ్య థియేటర్ యాజమాన్యం ముందుగానే థియేటర్ కు రావొద్దని చెప్పిందా?
* పోలీసులు అనుమతి ఇవ్వలేదని మీకు తెలుసా?
* సంధ్య థియేటర్‌లో ప్రీమియర్ షోకి రావడానికి మీరు అనుమతి తీసుకున్నారా? దాని కాపీ మీ దగ్గర ఉందా?
* మీరు లేదా మీ PR టీమ్ పోలీసుల నుంచి పర్మిషన్ తీసుకున్నారా?
* సంధ్య థియేటర్ దగ్గర పరిస్థితిని మీ పీఆర్ టీమ్ మీకు ముందే వివరించారా?
ప్రత్యేక గదిలో న్యాయవాది అశోక్ రెడ్డి సమక్షంలో కొనసాగుతున్న అల్లు అర్జున్ విచారణ.. గంటన్నరగా కొనసాగనున్న విచారణ.
హీరో అల్లు అర్జున్ స్టేట్మెంట్ను పోలీసులు రికార్డ్ చేస్తున్నారు.. అల్లు అర్జున్ను పలు కీలక ప్రశ్నలు అడుగుతున్న పోలీసులు..
చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లో అల్లు అర్జున్ ను విచారిస్తున్న పోలీసులు.. బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన వ్యవహారంపై ప్రశ్నిస్తున్న పోలీస్ అధికారులు.. రాత్రి 9.30 గంటల నుంచి బయటకి వెళ్లే వరకు ఏం జరిగింది అనే దానిపై ప్రశ్నల వర్షం.. అనుమతి ఉందా లేదా అనే విషయంపై అల్లు అర్జున్ ను ప్రశ్నిస్తున్న పోలీసులు.. సంధ్య థియేటర్ ఘటనలో తొక్కిసలాటలో మహిళ చనిపోయిన విషయం తెలుసా లేదా అని ప్రశ్నిస్తున్న పోలీసులు..
అల్లు అర్జున్ ను విచారిస్తున్న ఏసీపీ, సెంట్రల్ జోన్ డీసీపీ నేతృత్వంలోని బృందం.. న్యాయవాది అశోక్ రెడ్డి సమక్షంలో కొనసాగుతున్న విచారణ.. చిక్కడపల్లి ఏసీపీ, డీసీపీ, ఇన్ స్పెక్టర్, ఎస్ఐలతో కలిసి విచారణ.. 50కి పైగా ప్రశ్నల్ని అల్లు అర్జున్ ముందు ఉంచిన పోలీసులు.. సంధ్య థియేటర్ ఘటనపై సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేసే యోచనలో పోలీసులు
చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లో అల్లు అర్జున్ ను ఏసీపీ రమేష్ కుమార్, సెంట్రల్ జోన్ డీసీపీలు విచారిస్తున్నారు..
చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు చేరుకున్న అల్లు అర్జున్.. పీఎస్ లోపలికి వెళ్లిన అల్లు అర్జున్.. సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో హాజరైన అల్లు అర్జున్..
చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు వచ్చిన అల్లు అర్జున్ అడ్వకేట్లు..
గ్రీన్ ఛానల్ ద్వారా చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు అల్లు అర్జున్ తరలింపు..
అల్లు అర్జున్ వెంట మామ చంద్రశేఖర్ రెడ్డి, తండ్రి అల్లు అరవింద్..
కాసేపట్లో చిక్కడపల్లి పీఎస్ కు అల్లు అర్జున్.. ఏసీపీ ముందు హాజరుకానున్న అల్లు అర్జున్.. విచారించనున్న ఏసీపీ రమేష్ కుమార్, సెంట్రల్ జోన్ డీసీపీలు.. చిక్కడపల్లి పీఎస్ వద్ద భారీ బదోబస్తు..
జూబ్లీహిల్స్ ఇంటి నుంచి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు బయలుదేరిన అల్లు అర్జున్.. కాసేపట్లో చిక్కడపల్లి పీఎస్ కు చేరుకోనున్న అల్లు అర్జున్
చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లో సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్ సహా 18 మంది స్టేట్ మెంట్ రికార్డింగ్.. చిక్కడపల్లి పీఎస్ లో సంధ్య థియేటర్ ఘటన దృశ్యాలు అల్లు అర్జున్ కు చూపనున్న పోలీసులు.. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లో అల్లు అర్జున్ ఏం చెబుతాడన్న అంశంపై సర్వత్రా ఉత్కంఠ..
ఐదు నిమిషాల్లో ఇంటి నుంచి చిక్కడపల్లి పీఎస్ కు బయలుదేరనున్న అల్లు అర్జున్.. ఇప్పటికే చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు వచ్చిన డీసీపీ..
సినీ ఇండస్ట్రీని తెలంగాణ నుంచి పంపించే కుట్ర జరుగుతుంది.. అల్లు అర్జున్ ఇంటిపై దాడి చేసి పిల్లలను భయభ్రాంతులు గురి చేశారు- బీజేపీ ఎంపీ డీకే అరుణ
అల్లు అర్జున్ ఇంటికి చేరుకున్న అతని మామ చంద్రశేఖర్ రెడ్డి..
కాసేపట్లో చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు అల్లు అర్జున్.. సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో విచారణ.. అల్లు అర్జున్ ఇంటికి ఇప్పటికే చేరుకున్న బన్నీ వాసు.
సినీనటుడు అల్లు అర్జున్ ఇంటి వద్ద భారీ పోలీస్ బందోబస్తు.. హీరో అల్లు అర్జున్ ఇంటి వద్ద పెద్ద ఎత్తున మోహరించిన టాస్క్ ఫోర్స్ టీమ్.. అల్లు అర్జున్ ఇంటి దారిలో రెండు వైపులా బారికేడ్లు ఏర్పాటు..
కేసు కోర్టు పరిధిలో ఉన్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలన్న ఏసీపీ రమేష్..
చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ వద్ద భారీ బందోబస్తు.. ఉదయం 11 గంటలకు విచారణకు పీఎస్ కు రానున్న అల్లు అర్జున్.. ఏసీపీ ముందు విచారణకు హాజరుకానున్న అల్లు అర్జున్.. అల్లు అర్జున్ ను విచారించనున్న దర్యాప్తు అధికారి ఏసీపీ రమేష్ కుమార్, సెంట్రల్ జోన్ డీసీపీలు.. చిక్కడపల్లి పీఎస్ వద్ద 200 మీటర్ల దూరం వరకు పోలీసుల ఆంక్షలు.. ఇతర వాహనాల రాకపోకలపై పోలీసుల ఆంక్షలు..
సంధ్య థియేటర్ ఘటనపై మరోసారి స్పందించిన పురంధేశ్వరి.. అల్లు అర్జున్ థియేటర్ కి వస్తున్నప్పుడు పోలీసులు భద్రత కల్పించాలి.. పోలీసులు భద్ర కల్పించలేదని అనుమానాలు కలుగుతున్నాయి..