Site icon NTV Telugu

Konda Vishweshwar Reddy: చేవెళ్లకు చుక్క నీరు రాదు.. మాయ మాటలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది..

Konda

Konda

Konda Vishweshwar Reddy: ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు అనేది అసాధ్యమైనది.. చేవెళ్ళకు ఒక చుక్క నీరు రాదు అని బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. కేవలం మాయమాటలు కాంగ్రెస్ చెప్పింది.. కేసీఆర్ ఈ ప్రాజెక్ట్ ను రద్దు చేస్తారు అనుకుంటే.. అంబేద్కర్ పేరు తీసి కాళేశ్వరం అని పేరు పెట్టారు.. కాంగ్రెస్ ప్రభుత్వ డిజైన్ బాగానే ఉంది.. కానీ, కేసీఆర్ చేసిన డిజైన్ సరిగ్గా చేయలేదు.. కాళేశ్వరం డిజైన్ బాధ్యత పూర్తిగా కేసీఆర్ దే.. కేసీఆర్ ఏన్నో మాటలు చెప్పారు.. కాళేశ్వరం ప్రాజెక్టు డిజైనింగ్ చర్చలో హరీష్ రావు గానీ ఈటల గానీ లేరు.. కాళేశ్వరం ప్రాజెక్టు ఇంజనీర్లది తప్పు.. కేసీఆర్ తానా అంటే తందాన అనే ఇంజనీర్ల ఉన్నారు.. ఈటలది ఒక చిన్న పాత్ర లేదు.. ఇంత పెద్ద అవినీతి జరిగిన ఇప్పటి వరకు ఎందుకు చర్యలు తీసుకోలేదు అని చేవెళ్ల బీజేపీ ఎంపీ ప్రశ్నించారు.

Read Also: Kingdom: అనుకున్నంతా అయ్యింది!

అయితే, కాళేశ్వరం కమిషన్ ముందు ఈటల రాజేందర్ ఏం చెప్పారో తెలియదు అని కొండా విశ్వేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. ఇందులో ఈటల పాత్ర జీరో.. ఈటలకు సపోర్టు చేసేందుకు రాలేదు.. నిజాలు చెప్పేందుకు వచ్చాను.. ఈటల కేసీఆర్ ను ప్రొటెక్ట్ చేశారు అంటే వంద శాతం తప్పు.. గులాబీ జెండా అందరిదీ అంటే ఈటలను తన్ని వెళ్లగొట్టారు అని ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి తెలిపారు.

Exit mobile version