Hyderabad Crime: నాచారంలో దారుణం.. హాస్టల్ లో విద్యార్థిని ఆత్మహత్య
- నాచారం పీఎస్ పరిధిలో నర్సింగ్ విద్యార్థిని ఆత్మహత్య..
- నాచారం లోని హాస్టల్ లో ఉంటున్న వెస్ట్ బెంగాల్ కు చెందిన విద్యార్థిని సంజిమా..
- సాయత్రం హాస్టల్ రూం లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంజీమా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hyderabad Crime: నాచారం పీఎస్ పరిధిలో నర్సింగ్ విద్యార్థిని ఆత్మహత్య ఘనంగా నగరంలో కలకలం రేపుతుంది. సంవత్సరం కాలంగా నాచారంలోని హాస్టల్ లో ఉంటున్న వెస్ట్ బెంగాల్ కు చెందిన విద్యార్థిని సంజీమా నిన్న సాయత్రం హాస్టల్ రూంలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. దీంతో హాస్టల్ లో వున్న విద్యార్థులు యజమానికి తెలియజేయడంతో హాస్టల్ నిర్వాహకులు షాక్ కి గురయ్యారు. అనంతరం పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటన స్థలానికి హుటాహుటిన చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సంజీమా మృతదేహాన్ని గాంధీకి తరలించారు. సంజీమా ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. సంజీమా సంవత్సరం కాలంగా హాస్టల్ లో అందరికితో బాగానే ఉంటుందని పోలీసులకు హాస్టల్ నిర్వాహకులు తెలిపారు. తన రూంలో మిగతా వారు ఏక్కడి వెళ్లారు, వారి ద్వారా సంజీమా ఆత్మహత్యకు గల కారణాలను తెలుసుకునేందుకు దర్యాప్తు చేస్తున్నారు. సంజీమాకు ఎవరైనా బాయ్ ఫ్రెండ్ వున్నాడా? తనకు సంబంధించిన వారు బంధువులు హైదరాబాద్ లో వున్నారా? అనే విషయమై ఆరా తీస్తున్నారు. నర్సింగ్ లో ఏమైన సమస్యలు ఉంటే హాస్టల్ వచ్చి ఆత్మహత్య చేసుకుందా? అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. సంజీమా మృతిపై కుటుంబ సభ్యులకు తెలియజేశారు.
Telangana Leads: పట్టుమని పదేళ్లు కూడా లేదు.. కానీ ధనిక రాష్ట్రాల్లో 2వ స్థానం..
Also Read
- Bhatti Vikramarka : తెలంగాణకు సూపర్ ఎల్ నినో ముప్పు.. డిప్యూటీ సీఎం భట్టి కీలక విజ్ఞప్తి
- Uttam Kumar Reddy : కాళేశ్వరం పునరుద్ధరణకు ఆర్మీ ఇంజనీర్.. బీఆర్ఎస్ తీరుపై మంత్రి ఉత్తమ్ ఫైర్
- Drugs Seized : హైదరాబాద్‌లో భారీగా డ్రగ్స్ పట్టివేత... భోపాల్ బస్సులో రూ.1.1 కోట్ల విలువైన మెథాంఫెటమిన్ సీజ్!
- Hyderabad: పవర్‌గ్రిడ్ మహిళల వాష్‌రూమ్‌లో రహస్య కెమెరా కలకలం.. అటెండెంట్ అరెస్ట్.. సైబర్ క్రైమ్‌కు కేసు బదిలీ
తాజావార్తలు
-
RBI Repo Rate: ఆర్బీఐ నుంచి భారీ షాక్.? రెపో రేటు పెంపుపై కీలక అంచనా.!
-
Trivikram: వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’పైనే గురూజీ ఆశలన్నీ!
-
Pakistan LPG Crisis: పాకిస్థాన్‌లో గ్యాస్ సంక్షోభం.. సిలిండర్ ధర రూ.8,000 దాటింది!
-
Sajjala Ramakrishna Reddy : చంద్రబాబుపై సజ్జల ఫైర్.. స్థానిక ఎన్నికల్లో అరాచకాలు సాగుతున్నాయంటూ ఆగ్రహం
-
Harshith Reddy: ఆ ఒక్క రీజన్‌తో ప్రభాస్ అన్న మా సినిమాను సపోర్ట్ చేశాడు..
ట్రెండింగ్
-
Humanoid Robot : కత్తి దాడినే అడ్డుకుంది.. చైనా రోబో విన్యాసాలు చూస్తే మైండ్ బ్లాక్
-
Incredible India : ప్రపంచ రికార్డుల ఖజానా.. భారత్‌లో ఈ ప్రదేశాలు చూశారా.?
-
Spine Health : చిన్న అలవాట్లే వెన్నెముకకు ముప్పు.. మీ పొజిషన్స్ సరిగ్గా లేకపోతే ఇబ్బందే
-
Bottle Gourd Roti Recipe: సొరకాయతో టేస్టీ రోటీలు.. బ్రేక్‌ఫాస్ట్‌కు అదిరిపోయే హెల్తీ రెసిపీ..
-
Shreyas Iyer History: మరో 25 పరుగులే.. మొదటి టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చరిత్ర!