Hyderabad: పవర్‌గ్రిడ్ మహిళల వాష్‌రూమ్‌లో రహస్య కెమెరా కలకలం.. అటెండెంట్ అరెస్ట్.. సైబర్ క్రైమ్‌కు కేసు బదిలీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hyderabad: హైదరాబాద్ నగరంలోని కవాడిగూడలో ఉన్న పవర్‌గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ కార్యాలయంలో దారుణ ఘటన వెలుగుచూసింది. మహిళల వాష్‌రూమ్‌లో రహస్యంగా మొబైల్ ఫోన్ అమర్చి అనుచితంగా వీడియోలు చిత్రీకరించేందుకు ప్రయత్నించిన ఘటన ఉద్యోగుల్లో తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనపై చర్యలు చేపట్టిన పోలీసులు ఫ్లోర్ అటెండెంట్‌గా పనిచేస్తున్న భరత్‌ను అరెస్ట్ చేశారు. కేసు సున్నితమైనది కావడంతో లోతైన విచారణ నిమిత్తం గాంధీనగర్ ఠాణా నుంచి సిటీ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేశారు.
బాధితురాలి ఫిర్యాదు ప్రకారం.. పవర్‌గ్రిడ్ కార్పొరేషన్లో ఉన్నత స్థాయిలో పనిచేస్తున్న ఓ మహిళ అక్టోబర్ 13 ఉదయం 10:30 గంటల సమయంలో ఆరో అంతస్తులోని మహిళల వాష్‌రూమ్‌కు వెళ్లారు. అక్కడ కమోడ్‌కు ఎదురుగా ఉన్న వాష్‌బేసిన్ కింద తెల్ల కాగితంతో కప్పి ఉన్న ఓ వస్తువుకు రెండు రంధ్రాలు కనిపించాయి. తొలుత దానిని రూమ్ ఫ్రెషనర్‌గా భావించిన ఆమె, అనుమానం వచ్చి పరిశీలించగా గోడకు డబుల్ సైడెడ్ టేప్‌తో మొబైల్ ఫోన్ అతికించి ఉన్నట్లు గుర్తించి షాక్‌కు గురయ్యారు.
Also Read
- Jayashankar Bhupalpally: చుట్టూ కరువు.. ఇక్కడ మాత్రం మోటార్ లేకుండానే ఉబికి వస్తున్న జలధారలు!
- Box Office Collection: కోలీవుడ్ కల కలగానే మిగిలిపోనుందా? ₹1000 కోట్ల టార్గెట్‌కు బ్రేక్ పడినట్లేనా..!
- IND vs NZ: భారత్, న్యూజిలాండ్ మ్యాచ్ లను చూడలేకపోతున్నారా..? ఉచితంగా ఎక్కడ చూడవచ్చో తెలుసా..?
- Fire Accidents: రాష్ట్రంలో వరుస అగ్నిప్రమాదాలు.. అధికారులను అప్రమత్తం చేసిన సీఎం!
సదరు ఫోన్‌ను తీసుకుని బయటకు వచ్చిన ఆమె, అదే అంతస్తులో విధులు నిర్వర్తిస్తున్న అటెండెంట్ భరత్‌ను దీనిపై ప్రశ్నించారు. దీంతో అతడు ఆమె చేతిలోని ఫోన్‌ను లాక్కుని పారిపోయేందుకు యత్నించాడు. వెంటనే ఆమె హెచ్చరించడంతో హెచ్ఆర్ విభాగం, భద్రతా సిబ్బంది అతడిని ప్రధాన ద్వారం వద్ద పట్టుకున్నారు. ఫోన్లోని వీడియోలను పరిశీలించేందుకు సిబ్బంది ప్రయత్నించగా, ఫోల్డర్‌కు పిన్ లాక్ కనిపించింది. పాస్వర్డ్ చెప్పాలని నిలదీయడంతో, ఆధారాలు దొరక్కుండా ఉండేందుకు నిందితుడు ఫోన్‌ను లాక్కుని నేలకేసి కొట్టి ధ్వంసం చేశాడు. ఆ అంతస్తులోని వాష్‌రూమ్‌ను సుమారు ఆరుగురు మహిళా ఉద్యోగులు వాడుతున్నారని, ఈ ఘటనతో వారంతా తీవ్ర ఆందోళనకు లోనయ్యారని బాధితురాలు పేర్కొన్నారు. ఫోన్‌ను ఫోరెన్సిక్ విశ్లేషణకు పంపి అందులోని సమాచారాన్ని వెలికితీయాలని, ఈ వ్యవహారంలో భరత్‌తో పాటు ఇతరుల ప్రమేయం ఉందా అనే కోణంలో తేల్చాలని డిమాండ్ చేశారు. తొలుత గాంధీనగర్ పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేయగా, ప్రస్తుతం సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు భారతీయ న్యాయ సంహిత (BNS)లోని సెక్షన్లు 77, 238తో పాటు ఐటీ చట్టం సెక్షన్ 66-E కింద కేసును రీ-రిజిస్టర్ చేసుకుని దర్యాప్తును వేగవంతం చేశారు.
తాజావార్తలు
-
Jayashankar Bhupalpally: చుట్టూ కరువు.. ఇక్కడ మాత్రం మోటార్ లేకుండానే ఉబికి వస్తున్న జలధారలు!
-
IND vs NZ: న్యూజిలాండ్‌కు డబుల్ షాక్.. ఆ ఇద్దరు స్టార్స్ దూరం!
-
Box Office Collection: కోలీవుడ్ కల కలగానే మిగిలిపోనుందా? ₹1000 కోట్ల టార్గెట్‌కు బ్రేక్ పడినట్లేనా..!
-
IND vs NZ: భారత్, న్యూజిలాండ్ మ్యాచ్ లను చూడలేకపోతున్నారా..? ఉచితంగా ఎక్కడ చూడవచ్చో తెలుసా..?
-
Sheikh Hasina: ‘మరణం రాసి ఉంటే నా దేశంలోనే చనిపోతా’.. కొత్త పాస్‌పోర్ట్, NID కోసం షేక్ హసీనా దరఖాస్తు
ట్రెండింగ్
-
Upcoming Smartphones: ఈ వారం లాంచ్ కానున్న కొత్త స్మార్ట్ఫోన్లు ఇవే.. 200MP కెమెరా, 8,000mAh బ్యాటరీతో Oppo Reno 17 సిరీస్..!
-
Airtel నుంచి ‘Buy 1 Get 1’ ఆఫర్.. ఆ ప్లాన్స్ తో ఒక్కసారి రీఛార్జ్ చేస్తే రెండుసార్లు ప్రయోజనం..!
-
Realme నుంచి పవర్ఫుల్ 5G ఫోన్లు.. 10,000mAh బ్యాటరీ, 200MP కెమెరాతో వచ్చేస్తున్న Realme 17 సిరీస్..!
-
IPL 2027: టీమిండియా పవర్ హిట్టర్‌పై కన్ను.. గుజరాత్ టైటాన్స్‌ది పెద్ద ప్లానే!
-
IPL 2027 Trade: డీల్ క్లోజ్.. పంజాబ్ కింగ్స్‌కు హార్దిక్ పాండ్యా.. మ్యాచ్ విన్నర్‌ను వదులుకున్న ప్రీతి జింటా!