Telangana Leads: ప్రధాన మంత్రి ఆర్థిక సలహా మండలి (PMEAC) రూపొందించిన జాబితాలో తెలంగాణ రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచింది. దీని ప్రకారం దేశంలోనే ధనిక రాష్ట్రంగా తెలంగాణ రెండో స్థానంలో నిలిచింది.పదేళ్లు కూడా నిండని రాష్ట్రం ఇప్పుడు దేశంలోనే 2వ ధనిక రాష్ట్రంగా సత్తా చాటింది. పూర్తి అర్బన్ (పట్టణ) రాష్ట్రంగా ఢిల్లీ తర్వాత తెలంగాణ రెండవ స్థానంలో ఉంది. ఇక దక్షిణాది రాష్ట్రాల్లో ఒకటైన ఆంధ్రప్రదేశ్ కూడా ధనిక రాష్ట్రమే అయినా తలసరి ఆదాయ గణాంకాల పరంగా మొదటి 5 స్థానాల్లోకి రాలేకపోయింది. అత్యధిక ఆదాయం వచ్చే హైదరాబాద్ లాంటి మహానగరం లేకపోవడమే ఇందుకు కారణమని ఆ రాష్ట్ర పాలకులు చెబుతున్నారు. అయితే, GDP పరంగా 9వ స్థానంలో, తలసరి ఆదాయ గణాంకాలలో 16వ స్థానంలో ఉంది.
Read also: Anna Canteens: ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్.. నేడు మరో 75 అన్న క్యాంటీన్లు ప్రారంభం
ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి నివేదిక ప్రకారం, తలసరి ఆదాయం పరంగా, దక్షిణాదిలోని ఐదు ధనిక రాష్ట్రాలు కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ, తమిళనాడు. 1991 సంవత్సరంలో ఇక్కడ తలసరి జనాభా చాలా తక్కువగా ఉన్నప్పటికీ, సరళీకరణ , ఇతర కారణాల వల్ల ఈ రాష్ట్రాలు గణనీయమైన వృద్ధిని సాధించాయి. దేశ జీడీపీలో ఈ 5 రాష్ట్రాల వాటా మార్చి, 2024తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో 30% గా నమోదైంది. మనం భారతదేశంలోని ఐదు ధనిక రాష్ట్రాల గురించి మాట్లాడినట్లయితే, అవి ఢిల్లీ (కేంద్రపాలిత ప్రాంతం), తెలంగాణ, కర్ణాటక, హర్యానా, తమిళనాడు. తలసరి ఆదాయంలో ఈ రాష్ట్రాలు అత్యంత సంపన్నమైనవి. కాగా.. దక్షిణాదికి ఆనుకుని ఉన్న మధ్య, పశ్చిమ రాష్ట్రం మహారాష్ట్ర ఇప్పటికీ అత్యధిక జీడీపీ అందిస్తున్న రాష్ట్రంగా నిలిచిన.. గత దశాబ్దన్నర కాలంగా 15% వాటా కలిగిన ఈ రాష్ట్రం ఇప్పుడు 13.3%కు పరిమితమైంది. దీంతో.. దేశ ఆర్థిక రాజధానిగా వెలుగొందుతున్న ముంబై మహానగరమే అత్యధిక జీడీపీకి కారణం.
Read also: Anna Canteens: ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్.. నేడు మరో 75 అన్న క్యాంటీన్లు ప్రారంభం
అంటే.. అనేక కార్పొరేట్ సంస్థలు ముంబై కేంద్రంగా తమ వ్యాపార కార్యాకలాపాలు సాగిస్తున్నాయి. ఇక్కడ ఎంపీ స్థానాల ప్రకారం చూస్తే.. 2వ అతిపెద్ద రాష్ట్రంగా ఉన్న మహారాష్ట్ర, తలసరి ఆదాయం గణాంకాల్లో మాత్రం తొలి 5స్థానాల్లో నిలవ లేకపోయింది. దీని ప్రకారం జాతీయ సగటు కంటే ఏ రాష్ట్రాల్లో తలసరి ఆదాయం ఎక్కువగా ఉంది.. అది ఎంత శాతం ఎక్కువగా ఉందనే అంశాలను పరిగణలోకి తీసుకుంటూ రాష్ట్రం 1960-61 నుంచి 2023-24 జాబితా రూపొందించగా.. ఢిల్లీ 250.8% మొదటి స్థానంలో నిలిచింది. తెలంగాణ 193.6% 2వ స్థానంలో నిలిచింది. ఢిల్లీ, తెలంగాణ తరువాత కర్ణాటక 180.7%, హర్యానా 176.8%, తమిళనాడు 171.1%తో మూడు, నాలుగు, ఐదవ స్థానాల్లో నిలిచాయి. అయితే.. ఇందులో కర్ణాటక 1960-61లో 96.7% అధిక తలసరి ఆదాయం కలిగి ఉండగా.. అదిప్పుడు రెట్టింపు అయింది. అత్యధిక జీడీపీ వాటా కల్గిన మహారాష్ట్ర సైతం 63 ఏళ్ల క్రితం ఉన్న 133.7% నుంచి 150.7% తలసరి ఆదాయం నమోదయ్యాయి.
SA vs AFG: చరిత్ర సృష్టించిన ఆఫ్ఘనిస్తాన్.. మొదటిసారి దక్షిణాఫ్రికా జట్టుపై విజయం..