TD Janardhan: హైదరాబాద్‌లో 100 అడుగుల NTR విగ్రహం ఏర్పాటు చేస్తామని టీడీ జనార్దన్ అన్నారు. టీడీపీని స్థాపించిన చోటే ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తామని జనార్దన్ అన్నారు. తెలంగాణ ప్రభుత్వం భూమి ఇచ్చిన తరువాత విగ్రహావిష్కరణ జరుపుతామని తెలిపారు. ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు ముఖ్య అతిథిగా హాజరవుతారని తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో టీడీపీ స్థాపించిన స్థలంలో ఎన్టీఆర్ వంద అడుగుల విగ్రహాన్ని ఆవిష్కరిస్తామన్నారు. తెలుగు ప్రజలందరినీ కలుపుకుపోవాలనే లక్ష్యంతో ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించారని గుర్తు చేశారు. ప్రపంచ వ్యాప్తంగా టీడీపీ కార్యకర్తలు ఉన్నారు. ఎన్టీఆర్ చేసిన సేవలకు ఇప్పటికే ప్రపంచ దేశాల నుంచి మంచి గుర్తింపు వచ్చిందని తెలిపారు. ఈ ఏడాది చివరి నాటికి హైదరాబాద్ నగరంలో అన్నగారి విగ్రహాన్ని నెలకొల్పి తెలుగు వారికి అంకితం చేస్తామన్నారు. శతజయంతి సందర్భంగా ఎన్టీఅర్ చైతన్య యాత్రలు, అసెంబ్లీ ప్రసంగాలు రెండు పుస్తకాలుగా ఇచ్చామన్నారు. ఇప్పుడు తారకరామం అనే పుస్తకాన్ని రిలీజ్ చేయనున్నామని వివరించారు. ఈ పుస్తక ఆవిష్కరణ 24న సాయంత్రం విజయవాడలో రిలీజ్ చేస్తామని వెల్లడించారు. ఎన్టీఆర్ వంద అడుగులు విగ్రహాన్ని టీడీపీ పార్టీ ఆవిష్కరణ చేసిన చోట హైదరాబాదులో చేస్తామని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం భూమి ఇచ్చిన తరువాత విగ్రహావిష్కరణ జరుగుతుందని స్పష్టం చేశారు.
Keshavapuram Reservoir: కేశవాపురం రిజర్వాయర్ కాంట్రాక్ట్ రద్దు.. ప్రభుత్వం మరో కీలక నిర్ణయం..