ముస్లింల పవిత్ర పండుగ రంజాన్ వేడుకలు హైదరాబాద్ లో ఘనంగా జరుగుతున్నాయి. పాతబస్తీ బహదూర్ పుర లోని ప్రధాన మీరాలం ఈద్గాలో ఉదయం 9గంటలకు సామూహిక ఈదుల్ ఫితర్ ప్రత్యేక రంజాన్ ప్రార్థనలు జరగనున్నాయి. ప్రార్ధనలో వేల సంఖ్యలో పాల్గొననున్నారు ముస్లింలు. జీహెచ్ఎంసీ, మెడికల్, మెట్రో వాటర్ వర్క్స్, రెవిన్యూ, శానిటేషన్, అగ్నిమాపక శాఖల అధికారులతో తగిన ఏర్పాట్లు చేసింది ప్రభుత్వం.
మీరాలం ఈద్గా లో 500 మంది పోలీసులతో కట్టు దిటమైన భద్రత ఏర్పాటుచేశారు. ఈద్గా లో సీసీ కెమెరాలతో భద్రతను పర్యవేక్షిస్తున్నారు. మీరాలం ఈద్గా సబ్ కమాండ్ కంట్రోల్ ద్వారా భద్రత చూస్తున్నారు పోలీసులు. ఈద్గాకు వచ్చే నాలుగు మార్గాల ఎంట్రెన్స్, బయటకు వెళ్ళే మార్గాల వద్ద మెటల్ డిటెక్టర్లతో తనిఖీలు చేస్తున్నారు. బాంబ్ స్క్వాడ్, స్నిఫర్ డాగ్ టీమ్స్ అందుబాటులో వుంచారు. లా అండ్ ఆర్డర్, సిటీ టాస్క్ ఫోర్స్, సిటీ ఆర్మ్ రిజర్వ్ పోలీస్, షీ టీమ్స్, ఎస్ బి ఇంటలిజెన్స్ బృందాలతో పోలీసు బందోబస్తు నిర్వహిస్తున్నారు.
బహుదూర్ పుర, మీరాలం ట్యాంక్, కిషన్ బాగ్, కాలాపత్తర్, సిక్ చౌని తదితర ప్రాంతాల వద్ద ట్రాఫిక్ అంతరాయం కలగకుండా ట్రాఫిక్ పోలీసులు విధులు నిర్వహిస్తున్నారు. నెలరోజుల పాటు పవిత్రమయిన ఉపవాసం వున్న ముస్లింలు ఈరోజు ఉపవాసాలు విడిచిపెడతారు. పరస్పరం ఆలింగనలతో, ప్రార్థనలతో మసీదులు సందడిగా మారాయి. రంజాన్ సందర్భంగా సోమవారం అర్థరాత్రి నుంచి పాతబస్తీలో షాపులు, షాపింగ్ సెంటర్లు రద్దీగా మారాయి. విద్యుత్ దీపాలంకరణలతో మసీదులు, షాపులు వెలిగిపోతున్నాయి.
Simhachalam: అప్పన్న చందనోత్సవం.. కదలివచ్చిన భక్తజనం