విశాఖ జిల్లాలోని సింహాచలం అప్పన్న ఆలయం భక్తజన సంద్రంగా మారింది. సింహాచలం ఆలయంలో స్వామివారి చందనోత్సవంలో పాల్గొన్నారు తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్. అంతరాలయంలో స్వామివారిని దర్శించుకున్నారు తమిళిసై. సింహాద్రి అప్పన్న నిజరూప దర్శనం లభించడం మహాభాగ్యం అన్నారు తమిళిసై. తొలిసారి చందనోత్సవంలో పాల్గొన్నాను. ఇక్కడ వరాహ లక్ష్మీనరసింహస్వామి పవర్ ఫుల్ గాడ్, ఆలయంలో అడుగు పెడితేనే వైబ్రేషన్స్ ఉన్నాయ్ అన్నారు తెలంగాణ గవర్నర్ తమిళసై.కొండపై స్వామివారి చందనోత్సవంకు క్రమంగా భక్తుల రద్దీ పెరుగుతోంది. సాయంత్రం వరకు రెండు లక్షల మంది స్వామివారి దర్శనానికి వస్తారని అంచనా వేశారు అధికారులు. అందుకు తగినట్టుగా ఏర్పాట్లు చేశారు అధికారులు.
చందనోత్సవంలో ఇప్పటివరకు 25వేల మందికి దర్శనాలు కల్పించారు అధికారులు. సాధారణ భక్తులకు స్వామి వారి దర్శనానికి రెండున్నర గంటల సమయం పడుతోంది. దేవస్థానంలోనే ఉండి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నారు కలెక్టర్ మల్లిఖార్జున,సీపీ శ్రీకాంత్. అపరిచితుల కదలికలపై భక్తులు జాగ్రత్తగా ఉండాలని, బయట వ్యక్తులు అందజేసే ప్రసాదాలు స్వీకరించవద్దని సిటీ పోలీసు కమిషనర్ శ్రీకాంత్ కోరారు.