Hyderabad : పోలీసులా.. మజాకా.. అదిరిపోయే స్టెప్పులతో డ్యాన్స్.. వీడియో..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్ నగరంలో వినాయక చవితి వేడుకలు ఘనంగా జరిగాయి..ప్రస్తుతం నిమజ్జన వేడుకలు ప్రశాంతంగా జరుగుతున్నాయి.. ఇక నిమజ్జనం రోజున హుస్సేన్ సాగర్ చుట్టూ రోడ్డుపై ఇసుక వేస్తే రాలనంతగా భక్తులు గుమిగూడి ఉత్సవాలు చేసుకుంటారు…భక్తుల రద్దీని కంట్రోల్ చెయ్యడం కోసం పోలీసులు కూడా నిమజ్జన ప్రాంతాల్లో భారీగా మొహరించారు.. భక్తులు ఆటపాటలు, డ్యాన్సులతో బొజ్జ గణపయ్యను నిమజ్జనం చేస్తుండగా పోలీసులు తమ బాధ్యతను నిర్వర్తిస్తుంటారు.
ఈ ఏడాది మాత్రం పోలీసులు ఓ అడుగు ముందుకు వేసి హుషారుగా కాలు కదిపారు. భక్తులతో పాటు ఊరేగింపులో వారు కూడా భాగస్వామ్యం పంచుకున్నారు.. గణపయ్య భక్తులతో పాటు పోలీసులు కూడా అదిరిపోయే స్టెప్పులు వేశారు అందుకు సంబందించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. మిలాద్ ఉన్ నబీ, గణపతి నిమజ్జనం ఒకే రోజు రావడంతో మతపరమైన ఉద్రిక్తతలు చోటుచేసుకునే ముప్పును అంచనా వేశారు. హైదరాబాద్‌లో పాతబస్తీ సహా మిగిలిన ఏరియాల్లోనూ ముస్లింలు పెద్ద సంఖ్యలో ఉంటారు. గణపతి నిమజ్జనం నగరంలో పెద్ద ఎత్తున జరుగుతుందని తెలిసిందే. ఈ రెండు ఒకే రోజున వచ్చినప్పటికీ నగరంలో మతపరమైన ఉద్రిక్తతలు చోటుచేసుకోలేవు. అంతేకాదు, మతసామరస్యత వెల్లివిరిసింది. గణపతి నిమజ్జనాన్ని దృష్టిలో పెట్టుకుని ర్యాలీని వచ్చే నెల 1కి వాయిదా వేశారు..
Also Read
మరోసారి హైదరాబాద్‌లోని మతసారమస్యాన్ని వెల్లడించింది. ఒక మతాన్ని మరో మతం వారు గౌరవించుకోవడం స్పష్టంగా కనిపించింది. ముస్లింలు మిలాద్ ఉన్ నబీ ఊరేగింపును అక్టోబర్ 1వ తేదీకి వాయిదా వేసుకున్నట్టు సియాసత్ పత్రిక రిపోర్ట్ చేసింది. గణపతి నిమజ్జనం అదే రోజు రావడం వల్లే వాయిదా వేసినట్టు తెలిపింది. ప్రతి ఏడాది ఊరేగింపు సేమ్ డే నాడే నిర్వహిస్తారు..28 న వినాయకుడి నిమజ్జనం కావడం తో శాంతియుతంగా వాళ్ళు విరమించుకున్నారు.. ఇక పోతే ట్యాంక్ బండ్ వద్ద కూడా పోలీసులు జనాలతో కలిసి సందడి చేశారు.. మహిళా పోలీసులు డ్యాన్స్ లతో అదరగోట్టారు.. అందుకు సంబందించిన వీడియోలు కూడా ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి..ఇకపోతే కొన్ని ఏరియాల్లో వినాయకుడును 15 రోజులకు నిమజ్జనం చేస్తున్నారు..
“GANGA – JAMUNI Tehzeeb”: That’s what #Telangana is Proud of✊
Today happens to be the day when #GaneshNimarjan and #MiladUnNabi coincide
And here👇are the People and the Police👮♂️ celebrating the festivities with music and dance on the streets of #Hyderabad
When a Leader like… pic.twitter.com/H9PEZgbW78
— Putta Vishnuvardhan Reddy (@PuttaVishnuVR) September 28, 2023
తాజావార్తలు
-
The Paradise: నాని ‘ది ప్యారడైజ్’కు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్.. టికెట్ రేట్లు పెంపు, స్పెషల్ షోలకు ఓకే!
-
Komatireddy Venkat Reddy : కేటీఆర్ నోరు అదుపులో పెట్టుకోవాలి.. మంత్రి కోమటిరెడ్డి హాట్ కామెంట్స్..
-
Asaduddin Owaisi: ‘బీజేపీని ఆపాలంటే మాతో మాట్లాడండి’.. యూపీలో ఓవైసీ ఆఫర్..
-
Team India: టీమిండియాకు బిగ్ షాక్.. శుభమన్ గిల్, జస్ప్రీత్ బుమ్రా దూరం.. కారణం ఇదే..
-
SIR: వీవీఐపీలకు SIR షాక్.. జైశంకర్, ఆర్మీ చీఫ్, CBI డైరెక్టర్ పేర్లు..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!