Sunday Funday: ఉరుకుల పరుగుల జీవతం.. డబ్బు సంపాదించేందుకు ఎన్నో కష్టాలు. బతుకు బండి కదలాలంటే ఎన్నో సవాళ్లు. ఇలాంటి ఆలోచనలతో మనిషి మానషికంగానే కాదు.. శారీరకంగా ఎంతో అలసిపోతాడు. అయితే ఈ ఒత్తిడి అధిగమించాలంటే కాస్త ప్రశాంతత వాతావరణం కావాలి. కుటుంబంతో ఆహ్లాదంగా గడిపేందుకు సమయాన్ని కేటాయించుకోవాలి. మనల్నే కాదు వారిని కూడా కాస్త ప్రశాంత వాతావరణంలో గడిపేందుకు స్వేచ్చను ఇవ్వాలి. ఇలాంటి వారి వీక్ ఎండ్ లో ఎంజాయ్ చేసేందుకు ఏ పార్కుకు వెళ్లే అవసరం లేకుండా.. మనం ఇంట్లో తినే ఆహారం కాకుండా అక్కడు వెళ్లి కొత్త రుచులతో ఆ వాతావరణాన్ని మన కుటుంబ సభ్యులతో ఆనందంగా గడిపేందుకు నగర ప్రజలకు ట్యాంక్ అందాలు రండి రండి అంటూ స్వాగతం పలుకుతున్నాయి. ఆదివారం ఆహ్లాదంగా గడిపేందుకు మీ ముందుకు సండే ఫండే పేరుతో ట్యాంక్ బండ్ పై ప్రభుత్వం ఆహ్లాదకరమైన కార్యక్రమాలు నిర్వహిస్తున్న సంగతి మనం మరిచిపోయి ఎక్కడెక్కడికో తిరుగుగున్నాం. అందుకు ఇవాళ ట్యాంక్ బండ్ అందాలు చూసేందుకు ఉల్లాసంగా గడిపేందుకు నగరవాసులు ట్యాంక్ బండ్ పై వెళ్లేద్దాం పదండి. కరోనా కారణంగా కొంతకాలంగా ‘సండే-ఫన్‌డే’ ఆపివేశారు దీంతో నగరవాసులు ఇక సన్ డే ఫన్ డే ఉండదేమో అనే ఆయోమయంలో వున్న వారికి ఇది గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఇవాల్టి నుంచి హైదరాబాద్ నగరవాసుల కోసం ‘సండే-ఫన్‌డే’ తిరిగి ప్రారంభం కాబోతుంది.
Read also: Inappropriate posts on Secretariat: సచివాలయంపై అనుచిత వ్యాఖ్యలు.. కరీంనగర్ కు చెందిన వ్యక్తి అరెస్ట్
గతంలో ప్రతి ఆదివారం సాయంత్రం ట్యాంక్ బండ్ పై అనేక వినోద కార్యక్రమాలు, లేజర్ షోలు నిర్వహించేవారు. కుటుంబ సభ్యులతో కలిసి చల్లగాలిని ఆస్వాదిస్తూ ఈ కార్యక్రామలు చూసేవారు. దీనికి ప్రజల నుంచి విశేష స్పందన వచ్చింది. ఇటీవల హుస్సేన్ సాగర్ సీతారామంలో ఫార్ములా ఇ రేస్ పోటీలు జరిగిన సంగతి తెలిసిందే. ఈ కారణంగా సండే-ఫన్‌డేను మధ్యలో నిలిపివేశారు. ఇప్పుడు సండే-ఫన్‌డే పునఃప్రారంభమవుతున్నట్లు హెడ్ MDA కమిషనర్ అరవింద్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఇక్కడికి వచ్చే వారి ఉత్సాహం కోసం ఏకంగా రూ. 17 కోట్లతో హుస్సేన్ సాగర్‌లో మ్యూజికల్ ఫౌంటెన్‌ను గ్రాండ్‌గా ఏర్పాటు చేశారు. నిత్యం బిజీబిజీగా ఉంటూ కుటుంబ సమేతంగా ఆనందంగా గడిపేందుకు టెన్షన్ పడే వారికి ఆదివారం మంచి అవకాశం అంటున్నారు అరవింద్ కుమార్. ప్రతి శని, ఆదివారాల్లో రాత్రి 7 గంటల నుంచి 10 గంటల వరకు 4 షోలు నిర్వహించనున్నట్టు తెలిపారు. ఒక్కో షో 15 నిమిషాల పాటు ఉంటుందన్నారు. ఆదివారం ఈ వేడుకల నేపథ్యంలో ట్యాంక్‌బండ్‌పై సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు వాహనాల రాకపోకలను పూర్తిగా నిలిపివేస్తున్నట్లు సమాచారం. ఈ సౌకర్యాన్ని తప్పక వినియోగించుకోవాలని అరవింద్ కుమార్ ట్విట్టర్ ద్వారా ప్రజలను కోరారు.