Indiramma Houses : ఇందిరమ్మ ఇళ్లలో ఫైనల్ ట్విస్ట్.. ఇక అధికారులే ఇంటికొస్తారు.!
- నాలుగు రోజుల్లో వెరిఫికేషన్
- ఇంటింటికీ అధికారుల తనిఖీ
- అనర్హులకు షాక్.. వెయిటింగ్ లిస్ట్ రెడీ
- తుది జాబితాపై అందరి చూపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Indiramma Houses : హైదరాబాద్ నగరవాసులకు తెలంగాణ ప్రభుత్వం అందించే ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపు ప్రక్రియ ఇప్పుడు అత్యంత కీలకమైన తుది ఘట్టానికి చేరుకుంది. దరఖాస్తుదారుల నుంచి లాటరీ పద్ధతి ద్వారా ప్రాథమికంగా ఎంపిక చేసిన లబ్ధిదారుల సమాచారాన్ని క్షేత్రస్థాయిలో నేరుగా వెళ్లి సమగ్రంగా తనిఖీ చేసేందుకు గృహనిర్మాణ శాఖ అధికారులు రంగంలోకి దిగారు. నగర పరిధిలోని మొత్తం 16 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బుధవారం నుంచే ఈ ప్రత్యేక తనిఖీ కార్యక్రమం అధికారికంగా ప్రారంభమైంది.
నాలుగు రోజుల్లో వెరిఫికేషన్ పూర్తి
ఈ కీలకమైన పరిశీలన ప్రక్రియను రాబోయే నాలుగు రోజుల్లోనే వేగంగా పూర్తి చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రతీ నియోజకవర్గంలో రోజుకు సగటున 150 లబ్ధిదారుల ఇళ్లను అధికారులు స్వయంగా సందర్శించనున్నారు. ఇందుకోసం హౌసింగ్ బోర్డు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించడమే కాకుండా, తనిఖీలు పారదర్శకంగా నిర్వహించేందుకు అధికారులకు ముందస్తు శిక్షణ కూడా పూర్తి చేసింది. ప్రస్తుతం ప్రతి నియోజకవర్గానికి 480 మంది చొప్పున లబ్ధిదారులకు ఇళ్లను మంజూరు చేసేందుకు ప్రాథమికంగా ఎంపిక చేశారు.
Also Read
వెయిటింగ్ లిస్ట్‌లోని వారికి దక్కనున్న అవకాశం
క్షేత్రస్థాయి తనిఖీల్లో దరఖాస్తుదారులు ఇచ్చన వివరాలు తప్పుగా ఉన్నా లేదా ఏవరైనా అనర్హులుగా తేలినా వారిని జాబితా నుంచి తక్షణమే తొలగిస్తారు. అలా ఖాళీ అయిన స్థానాల్లో ఇప్పటికే సిద్ధం చేసిన వెయిటింగ్ లిస్ట్ నుంచి తర్వాతి అర్హులైన అభ్యర్థులకు అవకాశం కల్పిస్తారు. నియోజకవర్గాన్ని బట్టి 120 నుంచి 300 వరకు వెయిటింగ్ లిస్ట్ దరఖాస్తుదారులు అందుబాటులో ఉన్నారు. ఈ నాలుగు రోజుల వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తయిన వెంటనే అర్హులైన వారి తుది జాబితాను ప్రభుత్వం అధికారికంగా ప్రకటిస్తుంది.
అధికారులు పరిశీలించే అంశాలు , వివరాల నమోదు
లబ్ధిదారులు గత 10 ఏళ్లుగా అదే నియోజకవర్గ పరిధిలోనే స్థానికంగా నివసిస్తున్నారా లేదా అనే అంశాన్ని అధికారులు ప్రధానంగా తనిఖీ చేస్తారు. దీనితో పాటు దరఖాస్తులో సమర్పించిన వివరాలు, కుటుంబ సభ్యుల సమాచారం నిజమైనవా కాదా అనే వివరాలను అక్కడికక్కడే నిర్ధారించుకుంటారు. పరిశీలనలో అన్నీ సరిగ్గా ఉన్నాయని తేలితే, వెంటనే ప్రత్యేక యాప్‌లో ఆ సమాచారాన్ని నమోదు చేసి, సదరు లబ్ధిదారుని నివాసాన్ని అక్కడికక్కడే జియో ట్యాగింగ్ చేస్తారు.
పోర్టల్‌లో వివరాలు , అభ్యంతరాల నమోదు
ఆగస్టు 28 నుంచి 31 వరకు నిర్వహించిన లాటరీ విజేతల వివరాలను హౌసింగ్ బోర్డు తమ అధికారిక వెబ్సైట్ [https://tghb.telangana.gov.in/allotmentobjection](https://tghb.telangana.gov.in/allotmentobjection) లో అందుబాటులో ఉంచింది. దరఖాస్తుదారులు తమ పేరు, అప్లికేషన్ నంబర్ లేదా ఆధార్ కార్డు వివరాలను నమోదు చేసి తమ స్టేటస్ చెక్ చేసుకోవచ్చు. ఈ ఎంపిక ప్రక్రియపై లేదా లబ్ధిదారుల వివరాలపై ఏవైనా అభ్యంతరాలు, ఫిర్యాదులు ఉంటే దరఖాస్తుదారులు అదే పోర్టల్ ద్వారా అధికారుల దృష్టికి తీసుకెళ్లే సదుపాయాన్ని కూడా కల్పించారు.
తాజావార్తలు
-
Indiramma Houses : ఇందిరమ్మ ఇళ్లలో ఫైనల్ ట్విస్ట్.. ఇక అధికారులే ఇంటికొస్తారు.!
-
India-US: భారత్-అమెరికా మధ్య వాణిజ్య బంధం.. ఈ నెలాఖరులో అమెరికాకు పీయూష్ గోయల్!
-
ATM Charges: ఏటీఎం విత్‌డ్రాయల్‌పై భారీ మార్పులు.. ఆ బ్యాంక్ కస్టమర్లు తెలుసుకోవాల్సిన కొత్త ఛార్జీలు
-
Egg Prices: 40% పెరిగిన కోడిగుడ్ల ధరలు.. E20 విధానమే కారణమా.?
-
Ponguleti Srinivas Reddy : సన్న వడ్లకు రూ.500 బోనస్.. పొంగులేటి కీలక ప్రకటన
ట్రెండింగ్
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్‌తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్‌లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్.!