India-US: భారత్-అమెరికా మధ్య వాణిజ్య బంధం.. ఈ నెలాఖరులో అమెరికాకు పీయూష్ గోయల్!
- భారత్-అమెరికా మధ్య వాణిజ్య బంధం
- ఈ నెలాఖరులో అమెరికాకు పీయూష్ గోయల్!
- గణనీయమైన పురోగతి సాధించామన్న సెర్గియో గోర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత్-అమెరికా దేశాలు న్యాయమైన, పరస్పర ప్రయోజనకరమైన వాణిజ్య సంబంధాన్ని నిర్మించేందుకు సన్నిహితంగా పనిచేస్తున్నాయని భారత్‌లోని అమెరికా రాయబారి సెర్గియో గోర్ తెలిపారు. ఇరు దేశాల మధ్య వాణిజ్య అవగాహనపై ఇప్పటికే గణనీయమైన పురోగతి సాధించామని వెల్లడించారు. కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఈ నెలాఖరులో అమెరికా పర్యటనకు వెళ్లనున్నారని ఆయన తెలిపారు.
ఆటోమోటివ్ కాంపోనెంట్ మాన్యుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా 66వ వార్షిక సమావేశంలో సెర్గియో గోర్ ప్రసంగించారు. ఈ సందర్భంగా భారత్-అమెరికా వాణిజ్య సంబంధాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘న్యాయమైన, పరస్పర ఇరు దేశాలకు ప్రయోజనం చేకూర్చే వాణిజ్య సంబంధాన్ని నిర్మించేందుకు మా రెండు ప్రభుత్వాలు సన్నిహితంగా కలిసి పనిచేస్తున్నాయి. ఇది ఇంకా అధికారికంగా ప్రకటించారా లేదా నాకు తెలియదు. కానీ మంత్రి పీయూష్ గోయల్ ఈ నెలాఖరులో అమెరికా పర్యటనకు వెళ్లనున్నారు. జీ20 చర్చల నేపథ్యంలో అమెరికాతో చర్చలను కొనసాగిస్తారు’’ అని సెర్గియో గోర్ పేర్కొన్నారు. ఇరు దేశాల ప్రభుత్వాలు ఇప్పటికే కుదుర్చుకున్న వాణిజ్య అవగాహనతో పాటు పలు అంశాల్లో వాస్తవమైన పురోగతి సాధించామని తెలిపారు.
Also Read
- Reliance: "కాంపిటీషన్‌కు మేము భయపడం.. రండి చూసుకుందాం..".. మస్క్‌కు జియో స్ట్రాంగ్ కౌంటర్..
- NSUI Protest: సీజేపీ 'త్రివర్ణ యాత్ర'కు ముందు అర్ధరాత్రి ఢిల్లీలో హైవోల్టేజ్ డ్రామా..
- Abhijeet Dipke: నంబర్ ప్లేట్లు లేని కార్లు వెంబడిస్తున్నాయ్.. నన్ను ఎప్పుడైనా అరెస్ట్ చేయొచ్చు..
- Minister Rekha Arya Files FIR Against Husband: ఇతర మహిళలతో సంబంధాలు.. భర్తపై ఫిర్యాదు చేసిన మంత్రి.. అసలేం జరిగింది?
భారత్-అమెరికా మధ్య పురోగతి కేవలం వస్తువుల వాణిజ్యానికి మాత్రమే పరిమితం కాలేదని గోర్ అన్నారు. ఇరు దేశాలు దాదాపు అన్ని రంగాల్లో కలిసి పనిచేస్తున్నాయని పేర్కొన్నారు. ఈ ఏడాది భారత్, అమెరికా ‘Pact Silica’ డిక్లరేషన్‌పై సంతకం చేశాయని తెలిపారు. ఆవిష్కరణలకు అనుకూలమైన నియంత్రణ వ్యవస్థను ఏర్పాటు చేసే దిశగా ఇది కీలక ముందడుగు అని చెప్పారు. ఈ డిక్లరేషన్ వల్ల భారత్-అమెరికా కంపెనీలు పరస్పరం సరిహద్దులు దాటి పెట్టుబడులు పెట్టుకోవడం సులభతరం అవుతుందని గోర్ వివరించారు. అలాగే ఇరు దేశాల్లోని కొత్త తరం పారిశ్రామికవేత్తలు, ఆవిష్కర్తలకు మరిన్ని అవకాశాలు లభిస్తాయని తెలిపారు. భారత్-అమెరికా సంబంధాలు వాణిజ్యానికి మించి సాంకేతికత, పెట్టుబడులు, ఆవిష్కరణలు తదితర రంగాల్లో మరింత విస్తరిస్తున్నాయని సెర్గియో గోర్ పేర్కొన్నారు.
Delhi: At 66th Annual Session of the Automotive Component Manufacturers Association of India (ACMA), United States Ambassador to India Sergio Gor says, “Our two governments are working closely together to build a trade relationship that is fair, reciprocal, and mutually… pic.twitter.com/FnIzMb3dR9
— IANS (@ians_india) September 2, 2026
తాజావార్తలు
-
South Indian Heros: బాలీవుడ్ దర్శకులకు నో.. సౌత్ మేకర్స్‌కే జై.!
-
Reliance: “కాంపిటీషన్‌కు మేము భయపడం.. రండి చూసుకుందాం..”.. మస్క్‌కు జియో స్ట్రాంగ్ కౌంటర్..
-
Anupama Parameswaran: కేవలం డబ్బుల కోసమే సినిమాలు చేయను.. నా లక్ష్యం అదే!
-
Vaibhav Sooryavanshi: 15 ఏళ్ల వయసులోనే పతకాలు.. ప్రధాని మోడీ వ్యాఖ్యలకు వైభవ్ రియాక్షన్ వైరల్!
-
కారుతో రోడ్డుపైనే కాదు, గాల్లోనూ ప్రయాణం.! Elon Musk సంచలన డెమో.. గాల్లోకి దూసుకెళ్లిన Tesla Roadster..
ట్రెండింగ్
-
డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, పెర్ఫార్మన్స్.. ఐఫోన్ నుంచి గెలాక్సీ వరకు.. బెస్ట్ Foldable Phones ఇవే..!
-
కేవలం 25 కార్లే.. వచ్చీ రాగానే సేల్ అవుట్.! Jeep Wrangler Whitecap Mojito లాంచ్..
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్‌ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!