Egg Prices: 40% పెరిగిన కోడిగుడ్ల ధరలు.. E20 విధానమే కారణమా.?
- ఏడాదిలో 40 శాతం పెరిగిన కోడిగుడ్ల ధరలు..
- మొక్కజొన్న దాణా ధరలు పెరగడంతో పాటు పలు కారణాలు..
- E20 పాలసీతో పెరిగిన మొక్కజొన్న ధరలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Egg Prices: సామాన్యుడికి కోడిగుడ్ల ధరలు షాక్ ఇస్తున్నాయి. గత ఏడాది కాలంలో గుడ్ల ధరలు సుమారు 35 నుంచి 40 శాతం పెరిగినట్లు నేషనల్ ఎగ్ కోఆర్డినేషన్ కమిటీ (NECC) గణాంకాలు చెబుతున్నాయి. ప్రస్తుతం ఫామ్ స్థాయిలో ఒక్క గుడ్డు ధర సుమారు రూ.7కి చేరగా, రిటైల్ మార్కెట్లో వినియోగదారులకు రూ. 8.50 నుంచి రూ. 9 వరకు ధర ఉంది. రాబోయే చలికాలంలో గుడ్ల ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని ఫౌల్ట్రీ పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. చలికాలంలో సాధారణంగా కోడిగుడ్ల వినియోగం పెరుగుతుంది. దీనికి తోడు కోళ్ల దానా ధరలు పెరగడం ఫౌల్ట్రీ రైతులపై అదనపు భారం పడుతోంది.
E20 పాలసీ కారణమా..?
కోళ్ల దాణాకు ప్రధానంగా మొక్కజొన్నను ఉపయోగిస్తారు. ఫౌల్ట్రీ రైతుల మొత్తం ఉత్పత్తి వ్యయంలో మొక్కజొన్న వాటా సుమారు 65-70 శాతం వరకు ఉంటుందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. మూడేళ్ల క్రితం టన్ను మొక్కజొన్న ధర సుమారుగా రూ. 14,000 ఉండగా, ప్రస్తుతం రూ. 26,500కు పెరిగింది. గత 5 నెలల్లో మొక్కజొన్న ధర దాదాపుగా 20 శాతం పెరిగినట్లు తెలుస్తోంది. దాణా ధరల పెరుగుదల అంతిమంగా చికెన్, కోడిగుడ్ల ధరల పెరుగుదలకు దారి తీస్తుంది.
Also Read
- BJP: ‘‘కాంగ్రెస్ జోకర్ల పార్టీ’’.. రాహుల్ గాంధీపై బీజేపీ ఫైర్..
- Global Fuel Crisis: అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్‌లో రికార్డ్ స్థాయికి చేరిన డీజిల్, పెట్రోల్ ధరలు.. నెక్ట్స్ భారత్ వంతేనా?
- Job Loss Benefit: ఉద్యోగం పోయిందా? డోంట్ వర్నీ.. 50% జీతం మీ అకౌంట్లోకి వస్తుంది.. ఈ స్కీమ్ గురించి తెలుసా?
- Central Government Schemes: రైతులకు 3 అద్భుత కేంద్ర పథకాలు.. ఏటా రూ.6,000.. నెలకు రూ.3,000 పెన్షన్..!
అయితే, ఇక్కడే E20 పెట్రోల్ పాలసీపై ఆరోపణలు వస్తున్నాయి. పెట్రోల్‌లో ఇథనాలు కలపడం వల్ల మొక్కజొన్న అందుబాటులో ఉండటం లేదని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ఇథనాల్ ఉత్పత్తిలో చెరుకు, మొక్కజొన్న కీలకం. ఫౌల్ట్రీ రంగానికి అందుబాటులో ఉండే మొక్కజొన్న ఇప్పుడు ఇథనాల్ తయారీకి వాడుతున్నారని వారు ఆరోపిస్తున్నారు.
మొక్కజొన్న ఆధారిత ఇథనాల్ ఉత్పత్తి కూడా వేగంగా పెరిగింది. 2022లో సుమారు 10 లక్షల టన్నులుగా ఉన్న ఉత్పత్తి 2024లో 60 లక్షల టన్నులకు పైగా చేరింది. ప్రస్తుతం ఇది 1.7 కోట్ల టన్నులకు చేరినట్లు పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. 2030 నాటికి ఇథనాల్ కోసం మొక్కజొన్న వినియోగం 2.5 కోట్ల టన్నులకు చేరొచ్చని అంచనా. దీంతో ఫౌల్ట్రీ పరిశ్రమకు అవసరమయ్యే మొక్కజొన్న దూరమయ్యే అవకాశం ఉంది.
ఇథనాల్ ఒక్కటే కారణం కాదు..
కోడిగుడ్ల ధరలు పెరగడానికి E20 పాలసీ, ఇథనాల్ డిమాండ్ ఒక్కటే కారణం కాదు. వేసవి వేడి కారణంగా కోళ్లపై ఏర్పడే హీట్ స్ట్రెస్, కోళ్ల మరణాల రేటు, వాతావరణ పరిస్థితులు, దిగుమతి చేసుకునే దాణా పదార్థాల లభ్యత, వాటి ధరలు కూడా గుడ్ల ధరలపై ప్రభావం చూపుతున్నాయి. చలి కాలంలో గుడ్ల వినియోగం పెరుగుతుంది. అదే సమయంలో కోళ్ల దాణా అందుబాటులో ఉండకపోతే మరింతగా ధరలు పెరిగే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
BJP: ‘‘కాంగ్రెస్ జోకర్ల పార్టీ’’.. రాహుల్ గాంధీపై బీజేపీ ఫైర్..
-
The Paradise: అనిరుధ్ స్టూడియో నుంచి నాని ‘చిన్న లీక్’.. ‘ది ప్యారడైజ్’ 3rd సింగిల్‌పై క్రేజీ వీడియో వైరల్! చూశారా
-
AMB, AAAల తర్వాత ఇక ‘మెగా సినిమాస్’.. ప్రపంచ స్థాయి స్క్రీన్‌తో బాస్ ఎంట్రీ?
-
Ukraine War: రష్యాపై ఉక్రెయిన్ అతిపెద్ద దాడి.. 1000కి పైగా డ్రోన్లతో కల్లోలం..
-
Amazon Sale: ‘గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2026’ సేల్.. తేదీ ప్రకటించిన అమెజాన్..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!