Hyderabad Rains : హైదరాబాద్‌లో శుక్రవారం కురిసిన భారీ వర్షం కారణంగా నగరంలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. ముఖ్యంగా ‘పైగా’ కాలనీ, విమాన నగర్ ప్రాంతాల్లో వరద బీభత్సం చోటుచేసుకుంది. భారీ వర్షం కారణంగా హోండా షోరూమ్‌లోకి పెద్ద ఎత్తున వరదనీరు చేరడంతో సిబ్బంది చిక్కుకున్నారు.
షోరూమ్‌లో పనిచేస్తున్న సుమారు 80 మంది కార్మికులు వరదలో ఇరుక్కుపోయి సహాయం కోరారు. వెంటనే షోరూమ్ సిబ్బంది పోలీసులకు, డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (DRF), హైడ్రా అధికారులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న వెంటనే హైడ్రా, పోలీసులు, DRF బృందాలు రంగంలోకి దిగి రక్షణ చర్యలు చేపట్టాయి.
CM Chandrababu: “మనమీద నెట్టే రకం”.. మద్యం కుంభకోణంపై స్పందించిన సీఎం చంద్రబాబు..
వరద కారణంగా ప్రధాన ద్వారాల ద్వారా బయటకు రాలేకపోయిన కార్మికులను షోరూమ్ వెనుక భాగం నుండి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. కొందరిని DRF బృందాలు బోట్ల సాయంతో బయటకు తీసుకువచ్చాయి. సిబ్బంది అందరూ సురక్షితంగా రక్షించబడినట్లు అధికారులు తెలిపారు.
విమాన నగర్, పైగా కాలనీతో పాటు నగరంలోని ఇతర ప్రాంతాల్లో కూడా వర్షం కారణంగా నీరు నిలిచిపోయింది. వాతావరణ శాఖ జారీ చేసిన హెచ్చరికల మేరకు GHMC, పోలీస్, DRF బృందాలు అప్రమత్తంగా ఉన్నాయి.
CIBIL: ఇకపై లోన్లకు CIBIL అవసరం లేదా..? కొత్త వ్యవస్థకు కేంద్రం ప్లాన్..