Hyderabad Rains : హైదరాబాద్‌లో శుక్రవారం కురిసిన భారీ వర్షం కారణంగా నగరంలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. ముఖ్యంగా ‘పైగా’ కాలనీ, విమాన నగర్ ప్రాంతాల్లో వరద బీభత్సం చోటుచేసుకుంది. భారీ వర్షం కారణంగా హోండా షోరూమ్‌లోకి పెద్ద ఎత్తున వరదనీరు చేరడంతో సిబ్బంది చిక్కుకున్నారు. షోరూమ్‌లో పనిచేస్తున్న సుమారు 80 మంది కార్మికులు వరదలో ఇరుక్కుపోయి సహాయం కోరారు. వెంటనే షోరూమ్ సిబ్బంది పోలీసులకు, డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (DRF), హైడ్రా అధికారులకు సమాచారం అందించారు.…