Kidney Racket: కిడ్నీ రాకెట్ కొత్త కోణం.. హైదరాబాద్, కేరళ వేదికగా దందా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kidney Racket: ఆర్థిక అవసరాలను ఆసరాగా చేసుకుని మధ్యతరగతి యువకుల కిడ్నీలను కంత్రీగాళ్లు కొట్టేస్తున్నారు. కిడ్నీలు చెడిపోయాయంటూ అమాయక ప్రజలను నమ్మించి అవి సంపన్నుల దగ్గర లక్షలు బేరం పెట్టి పేదల కిడ్నీలు కొట్టేస్తున్న ముఠాలు అన్నీఇన్నీ కావు. తాజాగా కేరళలో మరో కిడ్నీ రాకెట్ వెలుగు చూసింది. హైదరాబాద్ కేంద్రంగా కిడ్నీ రాకెట్ నడుస్తోందని పోలీసులు గుర్తించారు. హైదరాబాదులోని ఒక ప్రముఖ డాక్టర్ ప్రమేయం ఉందని కేరళ పోలీస్ అంటున్నారు. హైదరాబాద్ నుంచి కొచ్చి మీదుగా ఇరాన్ కు తీసుకువెళ్లి కిడ్నీ ఆపరేషన్లు చేస్తున్నట్లు సంచలన విషమాలు వెలుగులోకి వచ్చాయి.
Read also: Janhvi Kapoor: జాన్వీ కపూర్ ఇంతలా కష్టపడిందా.. ప్రాక్టీస్ వీడియో వైరల్!
Also Read
- Bollaram Incident: ఉద్యోగంలో నుంచి తీసేశాడని కక్ష.. చిన్నారి కిడ్నాప్, హత్య..
- RTC-Metro Pass: ప్రయాణికులకు అలర్ట్.. ఆర్టీసీ -మెట్రో కామన్ పాస్ ధరలు తగ్గింపు..!
- Indiramma Towers: గుడ్‌న్యూస్.. జిల్లాల్లో కూడా ఇందిరమ్మ టవర్స్.. రూ.4 లక్షలకే ఫ్లాట్..
- CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
ఇప్పటివరకు పదుల సంఖ్యలో యువకుల్ని ఇరాన్ తీసుకొని వెళ్ళి ఆపరేషన్ చేయించినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కొచ్చిలో వెలుగు చూసిన కిడ్నీ రాకెట్ లో సబిత్ అనే యువకుడు అదుపులో తీసుకున్నట్లు సమాచారం. సబిత్ ఇచ్చిన సమాచారంతో కేరళ పోలీసులు హైదరాబాద్ చేరుకున్నారు. హైదరాబాద్ డాక్టర్ కి ఇద్దరు యువకులు సహకరించినట్లుగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ముఠా సభ్యులు బెంగళూరు, హైదరాబాద్‌లోని పేద యువకులను ఇరాన్‌కు తీసుకెళ్లి అక్కడ వారి కిడ్నీలను విక్రయిస్తున్నారు. బాధితుల్లో ఒకరు మృతి చెందడంతో అతని కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఇరాన్ నుంచి కొచ్చికి వచ్చిన ముఠాలోని కీలక సభ్యుడు సబిత్‌ను కేరళ పోలీసులు గత ఆదివారం విమానాశ్రయంలో అరెస్టు చేశారు. సోమవారం అంగమాలి జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచారు.
Read also: Ambala Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు మృతి, 20 మందికి పైగా గాయాలు
రిమాండ్ రిపోర్టులోని వివరాల ప్రకారం.. సబిత్ ఈ వృత్తిలోకి రావడానికి ప్రధాన కారణం అతను హైదరాబాద్‌కు చెందిన డాక్టర్ కావడమే. 2019లో హైదరాబాద్‌కు చెందిన సబిత్ అనే వైద్యుడు ఢిల్లీకి చెందిన వ్యక్తికి కిడ్నీ దానం చేయడం ద్వారా స్నేహం ప్రారంభించాడు. బెంగళూరు, హైదరాబాద్‌కు చెందిన 40 మంది యువకులను ఇరాన్‌కు తీసుకెళ్లి వారి కిడ్నీలను విక్రయించినట్లు సబిత్ అంగీకరించాడు. డబ్బు అవసరం ఉన్న పేద యువతకు దళారులు డబ్బులు ఇప్పిస్తానని చెప్పి కిడ్నీలు అమ్ముకునేలా మభ్యపెడుతున్నారు. కొందరు బ్రోకర్లు వారికి పాస్ పోర్టులు, వీసాలు సిద్ధం చేసి ఇరాన్ కు తీసుకెళ్తున్నారు. ఇరాన్లో రక్తసంబంధీకులు కాని వారికి అవయవాలు దానం చేసేందుకు అనుమతి ఉందని, అందుకే వారిని అక్కడికి తీసుకెళ్తున్నట్లు విచారణలో వెల్లడైంది. ఏ కిడ్నీ ఏ గ్రహీతకు సరిపోతుందో నిర్ణయించిన తర్వాత ఆసుపత్రిలో కిడ్నీ మార్పిడి చేస్తారు. ఆ తరువాత 20 రోజులు అపార్ట్మెంట్లో ఉంచబడుతుంది. రూ.లక్ష వరకు ఇస్తామని ఆశ చూపుతున్నారు. ఒక్కో కిడ్నీ దానానికి రూ.20 లక్షలు అమ్ముతున్నట్లు సమాచారం.
Janhvi Kapoor: జాన్వీ కపూర్ ఇంతలా కష్టపడిందా.. ప్రాక్టీస్ వీడియో వైరల్!
తాజావార్తలు
-
Virat Kohli Retirement: విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ నుంచి అకస్మాత్తుగా ఎందుకు రిటైర్ అయ్యాడు..? అసలు కథ ఇదే..
-
Tilak Varma Run Out: తిలక్ వర్మ నిర్లక్ష్యం.. ఊహించని రీతిలో రనౌట్.. అసలేం జరిగిందంటే?
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
Bollaram Incident: ఉద్యోగంలో నుంచి తీసేశాడని కక్ష.. చిన్నారి కిడ్నాప్, హత్య..
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
ట్రెండింగ్
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!
-
Naman Dhir: నువ్వు సిక్స్ కొడతావా.? నేను వికెట్ తీస్తా.. టీమిండియా సంచలనం తీరు మాములుగా లేదుగా.!
-
T20 World Record: 3 వికెట్లు.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్.. టీ20ల్లో సరికొత్త ప్రపంచ రికార్డు.! అర్ష్‌దీప్‌కు డబుల్ ధమాకా..
-
Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
-
Nitish Reddy: మా కెప్టెన్ వికెట్ తియ్యొద్దన్నాడు.. నితీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!