హైదరాబాద్ కూకట్‌పల్లిలో నిషేధిత చైనా మాంజా ఒక నిండు ప్రాణాన్ని బలిగొంది. సంగారెడ్డి జిల్లా కాజీపల్లికి చెందిన తండ్రి తన ఇద్దరు కుమార్తెలతో కలిసి బైక్‌పై కూకట్‌పల్లికి వస్తుండగా, వివేకానందనగర్ జాతీయ రహదారి వద్ద గాలిపటం దారం (చైనా మాంజా) ఐదేళ్ల చిన్నారి నిష్విక ఆదిత్య మెడకు బలంగా చుట్టుకుంది. ఒక్కసారిగా చిన్నారి కేకలు వేయడంతో తండ్రి బైక్ ఆపి చూసేసరికి, మాంజా కోసుకుపోవడంతో మెడ భాగం నుంచి తీవ్ర రక్తస్రావం జరిగింది.
Chiranjeevi : పద్మశ్రీ విజేతలను ఇంటికెళ్ళి సన్మానించిన చిరంజీవి
వెంటనే బాధితుడిని చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించినప్పటికీ, అప్పటికే చిన్నారి మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. కళ్ల ముందే కూతురు ప్రాణాలు కోల్పోవడంతో ఆ తండ్రి రోదనలు మిన్నంటాయి. ఈ హృదయ విదారక ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, నిషేధం ఉన్నప్పటికీ చైనా మాంజా విక్రయిస్తున్న వారిపై దర్యాప్తు ప్రారంభించారు. ప్రభుత్వ హెచ్చరికలను బేఖాతరు చేస్తూ ఇలాంటి ప్రమాదకర దారాలను వాడటం వల్ల సామాన్యుల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
IED Blasts : మావోయిస్టుల ఘాతుకం.. ఐఈడీ పేలుళ్లతో దద్దరిల్లిన కర్రెగుట్టలు..!