Hyderabad Census : హైదరాబాద్‌లో ఇంటింటికీ సర్వే.. మీ ఇంటికీ వస్తున్నారు జాగ్రత్త..!
- నేటి నుంచే జీహెచ్‌ఎంసీ హౌజ్ లిస్టింగ్ ప్రారంభం
- 21 వేల మందితో భారీ సర్వే ఆపరేషన్
- మీ డేటా సేఫ్.. జీహెచ్‌ఎంసీ కీలక హామీ
- కేవలం 10 నిమిషాల్లో పూర్తయ్యే జనగణన ప్రక్రియ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
GHMC: భాగ్యనగరంలో జనగణన (సెన్సస్) ప్రక్రియలో అత్యంత కీలకమైన హౌజ్ లిస్టింగ్ ఆపరేషన్స్ నేటి నుండి అధికారికంగా ప్రారంభమయ్యాయి. ఈ భారీ కార్యక్రమంపై జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ కీలక వివరాలను వెల్లడించారు. నగరవ్యాప్తంగా ప్రతి ఇంటిని సందర్శించి వివరాలు సేకరించే ఈ ప్రక్రియ నేటి నుంచి జూన్ 9వ తేదీ వరకు నిరంతరాయంగా కొనసాగనుంది. నగర అభివృద్ధిలో ఈ గణాంకాలు ఎంతో కీలకమని, అందుకే ప్రతి భవనాన్ని ఈ సర్వేలో భాగం చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు.
జీహెచ్‌ఎంసీ పరిధిలో ఈ సర్వే కోసం ప్రభుత్వం పక్కా ప్రణాళికను సిద్ధం చేసింది. మొత్తం 19,868 హౌజ్ లిస్టింగ్ బ్లాక్‌లను గుర్తించి, వాటిలో వివరాలు సేకరించడానికి 21,773 మంది ఎన్యూమరేటర్లను, వారికి మార్గనిర్దేశం చేసేందుకు 3,400 మంది సూపర్వైజర్లను రంగంలోకి దించారు. ప్రతి ఎన్యూమరేటర్ తమకు కేటాయించిన లేఅవుట్ మ్యాప్ ద్వారా సుమారు 200 నుంచి 300 ఇళ్లను సందర్శించాల్సి ఉంటుంది. సర్వేకు వచ్చే సిబ్బంది తప్పనిసరిగా తమ గుర్తింపు కార్డులతో (ID Cards) వస్తారని, జూన్ ఒకటో తేదీ నాటికి నగరంలో అత్యధిక శాతం సర్వే పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కమిషనర్ వివరించారు.
Also Read
- Dussehra Holidays 2026: ఏపీ, తెలంగాణ విద్యార్థులకు గుడ్ న్యూస్.. రేపటి నుంచే దసరా సెలవులు.. పూర్తి షెడ్యూల్ ఇదే!
- TGSRTC Union Elections: పదేళ్ల తర్వాత ఆర్టీసీ ఎన్నికలు.. మొదలైన పోలింగ్.. ఫలితాలు ఎప్పుడంటే?
- OTR: నారాయణ్ ఖేడ్‌లో భూ మంతర్.. ఫామ్ ల్యాండ్స్ పేరుతో విచ్చలవిడి వెంచర్స్
- OTR: ఆర్టీసీ ఎన్నికలకు BRS దూరం ఎందుకు?
ప్రజల నుంచి సేకరించే సమాచారం విషయంలో ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కమిషనర్ ఆర్వీ కర్ణన్ భరోసా ఇచ్చారు. ఎన్యూమరేటర్లు సేకరించే డేటాను కేవలం ప్రభుత్వ అవసరాల కోసం మాత్రమే ఉపయోగిస్తామని, దీనిని ఇతరులకు షేర్ చేయడానికి వీలు లేదని స్పష్టం చేశారు. చివరికి సమాచార హక్కు చట్టం (RTI) ద్వారా గానీ, కోర్టులకు గానీ ఈ డేటాను అందించబోమని ఆయన హామీ ఇచ్చారు. ఈ సర్వే ప్రక్రియ అంతా ‘ఎన్యూమరేట్ మొబైల్ యాప్’ ద్వారా డిజిటల్ పద్ధతిలో జరుగుతుంది. కుటుంబంలో ఎవరైనా ఒక్కరు అందుబాటులో ఉన్నా ఈ వివరాలు అందించవచ్చని, ఒకవేళ ఇంటికి తాళం వేసి ఉంటే ఎన్యూమరేటర్లు మరోసారి వచ్చి వివరాలు సేకరిస్తారని ఆయన తెలిపారు.
ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఈ సర్వేను అత్యంత సులభంగా నిర్వహించేలా రూపొందించారు. ఇందులో కేవలం 33 ప్రశ్నలు మాత్రమే ఉంటాయని, ఒక్కో ఇంటి వివరాల నమోదుకు సుమారు 10 నిమిషాల సమయం మాత్రమే పడుతుందని కమిషనర్ వెల్లడించారు. కుటుంబ యజమాని పేరు, ఫోన్ నెంబర్ వంటి ప్రాథమిక వివరాలు తప్పనిసరిగా ఇవ్వాలని, అనవసరమైన ఇతర వివరాలేవీ అడగబోమని ఆయన స్పష్టం చేశారు. ఈ సర్వే కేవలం నివాస గృహాలకే పరిమితం కాకుండా కమర్షియల్ భవనాలు, హాస్పిటల్స్, హోటళ్లు, అనాథాశ్రమాలు , కాలేజీ హాస్టళ్లను కూడా కవర్ చేయనుంది. జనగణన నిబంధనల ప్రకారం “ఒక కిచెన్‌ను ఒక ఫ్యామిలీ”గా పరిగణిస్తూ అధికారులు ముందుకు సాగుతున్నారు. ఇప్పటివరకు నగరంలో కేవలం 1.27 లక్షల మంది మాత్రమే సెల్ఫ్ ఎన్యూమరేషన్ పూర్తి చేసుకున్నారని, మిగిలిన వారందరూ ఎన్యూమరేటర్లకు సహకరించి ఈ బృహత్తర కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కమిషనర్ విజ్ఞప్తి చేశారు.
తాజావార్తలు
-
Dussehra Holidays 2026: ఏపీ, తెలంగాణ విద్యార్థులకు గుడ్ న్యూస్.. రేపటి నుంచే దసరా సెలవులు.. పూర్తి షెడ్యూల్ ఇదే!
-
AP Local Body Elections: ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలు.. సుప్రీంకోర్టు కీలక సూచనలు
-
Easy Egg Peeling Tips: ఉడికించిన గుడ్లను సులభంగా ఒలిచే సింపుల్ పద్ధతి.. ఈ చిన్న పొరపాట్లు చేయకండి!
-
Pinarayi Vijayan CMRL Case: మాజీ సీఎం పినరయి విజయన్‌కు హైకోర్టులో షాక్.. CMRL కేసులో FIRకు ఆదేశం!
-
Cancer Medicines Price Update: క్యాన్సర్ మందుల ధరలపై కేంద్రం కీలక నిర్ణయం.. 70 శాతం వరకు తగ్గింపు?
ట్రెండింగ్
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!