Ashada Bonalu: భాగ్యనగరంలో బోనాల జాతర సందడి.. జూలై 7న ఉత్సవాలు
- జూలై 7వ తేదీ నుంచి ఆగస్టు 4వ తేదీతో ముగుస్తాయి
- ఆషాడమాసం మొదటి ఆదివారం బోనాల ఉత్సవం
- జూలై 7వ తేదీ ఆదివారం - గోల్గొండ జగదాంబికకు తొలిబోనం
- ఆగస్టు 4 ఆదివారం - తొమ్మిదవ పూజ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ashada Bonalu: గోల్కొండ కోటలోని జగదాంబిక ఆలయంలో జ్యేష్ఠ మాసం అమావాస్య తర్వాత ప్రారంభమయ్యే ఆషాడమాసం మొదటి గురువారం లేదా మొదటి ఆదివారం నాడు బోనాల ఉత్సవం ప్రారంభమవుతుంది. ఈ సంవత్సరం జ్యేష్ఠమాస అమావాస్య జూలై 5వ తేదీ శుక్రవారం వస్తుంది…అంటే జూలై 6వ తేదీ శనివారం నుంచి ఆషాడమాసం ప్రారంభమవుతుంది. జూలై 7న ఆషాఢమాసం మొదటి ఆదివారం భాగ్యనగరంలో బోనాల సంబరం ప్రారంభమవుతుంది. గోల్గొండ శ్రీ ఎల్లమ్మ ఆలయంలో తొలి పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి, లాల్ దర్వాజ మహంకాళి ఆలయాల్లో ప్రతి గురు, ఆదివారాలు నెల రోజుల పాటు నిర్వహిస్తారు.
Read also: KCR: కేసీఆర్‌కు నోటీసులు.. వివరణకు రేపు లాస్ట్..
Also Read
జూలై 7వ తేదీ ఆదివారం – గోల్గొండ జగదాంబికకు తొలిబోనం సమర్పించడంతో ఉత్సవాలు ప్రారంభమవుతాయి. జూలై 11 గురువారం – రెండవ పూజ, జూలై 14 ఆదివారం – మూడవ పూజ కాగా.. జూలై 18 గురువారం – నాల్గవ పూజ నిర్వహిస్తారు. జూలై 21 ఆదివారం – ఐదవ పూజ, జూలై 25 గురువారం – ఆరోపూజ, జూలై 28 ఆదివారం – ఏడవ పూజ కాగా.. ఆగస్ట్ 1 గురువారం – ఎనిమిదవ పూజ అనంతరం.. ఆగస్టు 4 ఆదివారం – తొమ్మిదవ పూజ చేస్తారు. అంటే జూలై 7వ తేదీ ఆదివారం ప్రారంభమయ్యే బోనాలు…ఆగస్టు 4వ తేదీ ఆదివారంతో ముగుస్తాయి.
Read also: NTA Petition : పెండింగ్ కేసులు బదిలీ చేయండి.. ఎన్‌టీఏ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ
ఆషాడమాసంలో అమ్మ పుట్టింటికి వెళ్తుందని…అందుకే అమ్మవారిని తమ ఇంటి ఆడబిడ్డగా భావించి భక్తిశ్రద్ధలతో పూజించి నైవేద్యాలు సమర్పిస్తారని భక్తుల నమ్మకం. అప్పట్లో బోనాల పండుగ ప్రారంభం సమయంలో దుష్టశక్తులను పారద్రోలేందుకు నాగలిని బలి ఇచ్చేవారు. ఇప్పుడు దున్నడానికి బదులు కోళ్లు, మేకలను పెంచుతున్నారు. బోనాలు మోసిన మహిళలు అమ్మవారి అనుగ్రహం పొందుతారని భక్తులు విశ్వసిస్తారు.అందుకే బోనాలు మోసిన మహిళలు ఆలయానికి చేరుకోగానే పాదాలపై నీళ్లు చల్లి మొక్కులు చెల్లించుకుంటారు. మొదటి బోనం హైదరాబాద్‌లోని జగదాంబిక అమ్మవారి ఆలయంలో, రెండో బోనం బల్కంపేటలోని రేణుకా ఎల్లమ్మ ఆలయంలో, మూడో బోనం సికింద్రాబాద్‌లోని ఉజ్జయిని మహంకాళి ఆలయంలో సమర్పిస్తారు.
Today Gold Price: మగువలకు శుభవార్త.. భారీగా తగ్గిన బంగారం ధరలు!
తాజావార్తలు
-
Ind vs Afg T20 : ఆఫ్ఘన్‌పై భారత్ జోరు.. సిరీస్ కైవసం.!
-
Story Board : దిగ్గజాలు వద్దంటున్నారు..ట్రంప్ కావాలంటున్నారు..అసలు ఏఐ విషయంలో ఏం జరుగుతోంది..?
-
Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
-
OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
-
OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్‌లో ఏం మాట్లాడుకున్నారు..?
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్‌ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్‌ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?