KCR: కేసీఆర్‌కు నోటీసులు.. వివరణకు రేపు లాస్ట్..
- విద్యుత్ కొనుగోలు విషయంలో కేసీఆర్ కు నోటీసులు
- వివరణకు రేపు (జూన్ 15) ఆఖరి రోజు
- ఎన్నికల దృష్ట్యా కేసీఆర్ కు జూలై 30 వరకు సమయం
- జాన్ 15 లోపు మీ వివరణ ఇవ్వాలని ఆదేశం
- కమిషన్ ముందు విచారణకు రావాల్సిందే -జస్టిస్ నరసింహ రెడ్డి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BRS Chief KCR: తెలంగాణలో విద్యుత్ కొనుగోలు అంశం పెను దుమారాన్ని రేపుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక విద్యుత్ కొనుగోళ్ల వ్యవహారంపై విచారణకు ఆదేశించింది. ఇందుకోసం జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్‌ను ఏర్పాటు చేశారు. ఛత్తీస్‌గఢ్ విద్యుత్ కొనుగోలుతో పాటు యాదాద్రి, భద్రాద్రి థర్మల్ ప్లాంట్ల కొనుగోలుకు సంబంధించి వివరణ ఇవ్వాలని జస్టిస్ ఎల్.నర్సింహారెడ్డి నేతృత్వంలోని న్యాయ కమిషన్ గతంలో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్‌కు నోటీసులు జారీ చేసింది. రాతపూర్వకంగా వివరణ ఇవ్వాలని జూన్ 15 వరకు గడువు విధించింది. కానీ జూలై 30 వరకు గడువు ఇవ్వాలని కేసీఆర్ కోరగా.. అందుకు కమిషన్ అంగీకరించలేదు. గడువు ముగిసే విషయాన్ని న్యాయ కమిషన్ అధినేత జస్టిస్ ఎల్.నర్సింహారెడ్డి మీడియాకు వెల్లడించారు. దీంతో జూన్ 15 వరకు కేసీఆర్ నుంచి సమాధానం రాకపోతే కమిషన్ ఎలా స్పందిస్తుందనేది ఆసక్తికరంగా మారింది.జూన్ 16 తర్వాత ఏం జరుగుతుందనే చర్చ మొదలైంది.
Read also: Today Gold Price: మగువలకు శుభవార్త.. భారీగా తగ్గిన బంగారం ధరలు!
Also Read
- Telangana Drought: తెలంగాణలో కరవు టెన్షన్.. ఎల్‌నినో ప్రభావంపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్
- Bathukamma : రంగురంగుల పువ్వులతో విరబూసిన మార్కెట్లు.. భగ్గుమంటున్న ధరలు
- RIMS infant Deaths : రిమ్స్‌లో ఐదుగురు శిశువుల మృతి.. ఎలుకలు ఏసీ వైర్లు కొరకడంతోనే ప్రమాదం..
- Uppal T20 Match : ఉప్పల్ టీ20 టికెట్ల గోల్మాల్.. ఆన్లైన్లో సోల్డ్ ఔట్, హెచ్‌సీఏ ఏమంటోంది.?
కమిషన్ మరో లేఖ రాసి మరో డెడ్ లైన్ పెడుతుందా..? లేక నిర్ణీత గడువులోగా సమాధానం రాకపోవడానికి కారణం చూపుతూ సమన్లు జారీ చేస్తుందా..? నిబంధనలకు విరుద్ధంగా కమిషన్ చర్యలు తీసుకుంటుందా? ఇవీ కొనసాగుతున్న చర్చలు. అయితే కేసీఆర్ ఇచ్చే వివరణను బట్టి అక్కడ నేరుగా విచారణకు అవకాశం ఉంది. ఆయన సమాధానం సంతృప్తికరంగా లేకుంటే విద్యుత్ కమిషన్ నేరుగా విచారణకు దిగుతామని సంకేతాలిస్తోంది. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో విద్యుత్ కొనుగోళ్లలో అవకతవకలు జరిగాయని పేర్కొంటూ తెలంగాణ ప్రభుత్వం జస్టిస్ నరసింహారెడ్డి నేతృత్వంలో న్యాయ కమిషన్‌ను నియమించింది. ఈ క్రమంలో కమిషన్ విచారణ చేపట్టిన సంగతి తెలిసిందే. గత రెండు రోజులుగా బీఆర్‌ఎస్ హయాంలో పనిచేసిన కొందరు అధికారులను విచారణకు పిలిచి పలు కీలక అంశాలపై ప్రశ్నించారు. నిన్న మాజీ సీఎండీ ప్రభాకర్ రావును విచారించిన జస్టిస్ నరసింహారెడ్డి కాగా.. నేడు మాజీ సీఎం కేసీఆర్‌కు నోటీసులు పంపడం గమనార్హం.
Nabha Natesh: అబ్భా అనిపిస్తున్న నాభ నటేష్ అందాలు..
తాజావార్తలు
-
Abhijit Dipke: “రండి, మమ్మల్ని అరెస్ట్ చేయండి”.. విమానంలో అభిజీత్ దిప్కే హల్చల్
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
CJP Protest: ఢిల్లీలో ఉత్కంఠ.. అభిజీత్ దీప్కే, సౌరవ్ దాస్, రాంకా, ధ్రువ్ రాఠీ అరెస్ట్..
-
Kuttu Roti Recipe: నవరాత్రి ఉపవాసం కోసం కుట్టు రొట్టెలు.. పొంగేలా తయారు చేసే సులభమైన పద్ధతి
-
Fauzi vs Spirit: ఫౌజీ రిలీజ్ డేట్ చెప్పేస్తారా?.. ‘స్పిరిట్’ రాక ఆలస్యం కానుందా?
ట్రెండింగ్
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!
-
200MP పెరిస్కోప్ కెమెరా, 7 ఏళ్ల సాఫ్ట్వేర్ అప్డేట్స్ తో రాబోతున్న Motorola Signature 27..!