NTV Telugu Site icon

Hyderabad Blast Case: హైదరాబాద్ పేలుళ్ల కేసులో ట్విస్ట్ .. ఉగ్రవాదులకు సహాయం చేసిన వ్యక్తి..!

Hyderabad Blast Case

Hyderabad Blast Case

Hyderabad Blast Case: హైదరాబాద్ పేలుళ్ల కుట్రకేసులో నిర్ఘాంతపోయే నిజాలు బయటకు వస్తున్నాయి. నగరంలో ఉగ్రవాదులు ఉండటానికి ఓల్డ్ సిటీలోని ఓ వ్యక్తి ఆర్థిక సహాయం అందించినట్లు అధికారులు గుర్తించి షాక్ కు గురయ్యారు. పాతబస్తీకి చెందిన అబ్దుల్ కలీమ్ అనే వ్యక్తిని అరెస్టు చేసిన పోలీసులు అతన్ని రిమాండ్ తరలించారు. ఇంకా ఎవరైనా ఈకుట్రలో వున్నారా అనే కోణంలో విచారణ చేపట్టారు. హైదరాబాద్ లో నర మేధం సృష్టించేందుకు ముగ్గురు ఉగ్రవాదులు కుట్రపడిన జాహీద్ తో పాటు ముగ్గురిని గతంలోనే పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.. జాహీద్ కు అబ్దుల్ కలీం 40 లక్షల రూపాయల ఆర్థిక సహాయం చేసినట్లు గుర్తించారు. కలీం ఇచ్చిన 40 లక్షల రూపాయలతో జాహీద్ కార్లు బైకులు కొనుగోలు చేసినట్లు.. దీంతో జాహీద్ ముఠా విదేశాలను వచ్చిన హ్యాండ్ గ్రానైట్లతో పేలుళ్లకు కుట్ర పన్నినట్లు.. కార్లు బైకులు హ్యాండ్ గ్రానైట్ల పెట్టి పేల్చడానికి కుట్ర పన్నినట్లు గుర్తించారు. దసరా ఉత్సవాలతో పాటు హైదరాబాదులో జరిగే ఉత్సవాల్లో పేలుడు కు కుట్ర చేసినట్లు పేర్కొన్నారు. గతంలోని కుట్రని పోలీసులు భగ్నం చేసిన విషయం తెలిసిందే. అయితే.. ఇప్పటికే భాగ్యనగర్‌లో పేలుళ్లకు కుట్ర పన్నిన జాహెద్‌ ముఠాపై ఎన్‌ఐఏ కేసు నమోదు చేసింది. ఈ కేసును ఎన్‌ఐఏ విచారణ చేపట్టింది.

Read also: CM KCR Birthday Celebrations: నేడే తెలంగాణ సీఎం కేసీఆర్‌ పుట్టిరోజు.. రాష్ట్ర వ్యాప్తంగా సందడి

డిసెంబర్ 2022 నెలలో, జాహీద్ ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. జాహీద్ ముఠా పేలుడు పదార్థాలను పాకిస్థాన్, నేపాల్ మీదుగా హైదరాబాద్‌కు తరలించింది. దసరా వేడుకల్లో పేలుళ్లు జరపాలని కూడా ఈ ముఠా ప్లాన్ చేసింది. ఈ ఘటనకు సంబంధించి ఎన్‌ఐఏ తమ దర్యాప్తులో కీలక విషయాలను గుర్తించింది. నగరంలోని రద్దీ ప్రాంతాల్లో పేలుళ్లకు నిందితులు ప్లాన్ చేశారు. దేశ అంతర్గత భద్రతకు భంగం కలిగించాలని ఈ ముఠా ప్లాన్ చేసింది. జాహీద్, సమిద్దున్, మజా హసన్‌లను పోలీసులు అరెస్టు చేశారు. దసరా వేడుకల్లో ఆర్‌ఎస్‌ఎస్‌, బీజేపీ నేతలను హత్య చేసేందుకు ఈ ముఠా కుట్ర పన్నినట్లు పోలీసులు గుర్తించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ ఘటనలో నగర పోలీస్‌ కమిషనర్‌ కార్యాలయంలో హైదరాబాద్ సీపీ కార్యాలయంలో జరిగిన ఆత్మాహుతి దాడిలో ఓ హోంగార్డు మరణించాడు. ఈ ఘటనలో జాహెద్ ఆత్మాహుతి బాంబర్‌కు ఆశ్రయం కల్పించాడు. ఈ కేసులో జాహీద్ 12 ఏళ్ల పాటు జైలు జీవితం గడిపాడు. ఈ కేసు నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా జాహీద్ ఉగ్రవాదులతో సంబంధాలు ఏర్పరుచుకున్నట్లు పోలీసులు గుర్తించారు. దీంతో జాహీద్ పై పోలీసులు నిఘా పెంచారు. హైదరాబాద్ పేలుళ్లకు పోలీసులే కుట్ర పన్నారని తెలుసుకున్న పోలీసులు జాహీద్ ను అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం బయటపడింది.
Delhi liquor scam: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు.. దూకుడు పెంచిన ఈడీ