హైదరాబాద్ పేలుళ్ల కుట్రకేసులో సినిమాను తలపించే విధంగా రహస్యాలు బయటకు వస్తున్నాయి. నగరంలో ఉగ్రవాదులు ఉండటానికి ఓ వ్యక్తి ఆర్థిక సహాయం అందించినట్లు అధికారులు గుర్తించారు.
భాగ్యనగర్‌లో పేలుళ్లకు కుట్ర పన్నిన జాహెద్ ముఠాపై ఎన్‌ఐఏ కేసు నమోదు చేసింది. ఈ కేసును ఎన్‌ఐఏ విచారించనుంది. డిసెంబర్ 2022 నెలలో, జాహెద్ ముఠాను పోలీసులు అరెస్టు చేశారు.