Hyderabad Blast Case: హైదరాబాద్ పేలుళ్ల కేసులో ట్విస్ట్ .. ఉగ్రవాదులకు సహాయం చేసిన వ్యక్తి..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hyderabad Blast Case: హైదరాబాద్ పేలుళ్ల కుట్రకేసులో నిర్ఘాంతపోయే నిజాలు బయటకు వస్తున్నాయి. నగరంలో ఉగ్రవాదులు ఉండటానికి ఓల్డ్ సిటీలోని ఓ వ్యక్తి ఆర్థిక సహాయం అందించినట్లు అధికారులు గుర్తించి షాక్ కు గురయ్యారు. పాతబస్తీకి చెందిన అబ్దుల్ కలీమ్ అనే వ్యక్తిని అరెస్టు చేసిన పోలీసులు అతన్ని రిమాండ్ తరలించారు. ఇంకా ఎవరైనా ఈకుట్రలో వున్నారా అనే కోణంలో విచారణ చేపట్టారు. హైదరాబాద్ లో నర మేధం సృష్టించేందుకు ముగ్గురు ఉగ్రవాదులు కుట్రపడిన జాహీద్ తో పాటు ముగ్గురిని గతంలోనే పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.. జాహీద్ కు అబ్దుల్ కలీం 40 లక్షల రూపాయల ఆర్థిక సహాయం చేసినట్లు గుర్తించారు. కలీం ఇచ్చిన 40 లక్షల రూపాయలతో జాహీద్ కార్లు బైకులు కొనుగోలు చేసినట్లు.. దీంతో జాహీద్ ముఠా విదేశాలను వచ్చిన హ్యాండ్ గ్రానైట్లతో పేలుళ్లకు కుట్ర పన్నినట్లు.. కార్లు బైకులు హ్యాండ్ గ్రానైట్ల పెట్టి పేల్చడానికి కుట్ర పన్నినట్లు గుర్తించారు. దసరా ఉత్సవాలతో పాటు హైదరాబాదులో జరిగే ఉత్సవాల్లో పేలుడు కు కుట్ర చేసినట్లు పేర్కొన్నారు. గతంలోని కుట్రని పోలీసులు భగ్నం చేసిన విషయం తెలిసిందే. అయితే.. ఇప్పటికే భాగ్యనగర్‌లో పేలుళ్లకు కుట్ర పన్నిన జాహెద్ ముఠాపై ఎన్‌ఐఏ కేసు నమోదు చేసింది. ఈ కేసును ఎన్‌ఐఏ విచారణ చేపట్టింది.
Read also: CM KCR Birthday Celebrations: నేడే తెలంగాణ సీఎం కేసీఆర్ పుట్టిరోజు.. రాష్ట్ర వ్యాప్తంగా సందడి
Also Read
- Current Charges Increased: విద్యుత్ వినియోగదారులకు బిగ్ షాక్.. పెరిగిన కరెంట్ ఛార్జీలు.. ఒక్కో యూనిట్‌కు ఎంతంటే..
- ACB Raids: తెలంగాణ ఏసీబీ చరిత్రలోనే అతి పెద్ద అవినీతి తిమింగలం.. ఎట్టకేలకు చిక్కేసింది..
- Off The Record: పేకాట పంచాయితీతో కాంగ్రెస్‌లో చిచ్చు..! పేకాటా? పవర్ గేమా?
- Land Pass Books: 'భూదార్' పేరుతో పాస్ పుస్తకాలు.. మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు..
డిసెంబర్ 2022 నెలలో, జాహీద్ ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. జాహీద్ ముఠా పేలుడు పదార్థాలను పాకిస్థాన్, నేపాల్ మీదుగా హైదరాబాద్‌కు తరలించింది. దసరా వేడుకల్లో పేలుళ్లు జరపాలని కూడా ఈ ముఠా ప్లాన్ చేసింది. ఈ ఘటనకు సంబంధించి ఎన్‌ఐఏ తమ దర్యాప్తులో కీలక విషయాలను గుర్తించింది. నగరంలోని రద్దీ ప్రాంతాల్లో పేలుళ్లకు నిందితులు ప్లాన్ చేశారు. దేశ అంతర్గత భద్రతకు భంగం కలిగించాలని ఈ ముఠా ప్లాన్ చేసింది. జాహీద్, సమిద్దున్, మజా హసన్‌లను పోలీసులు అరెస్టు చేశారు. దసరా వేడుకల్లో ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీ నేతలను హత్య చేసేందుకు ఈ ముఠా కుట్ర పన్నినట్లు పోలీసులు గుర్తించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ ఘటనలో నగర పోలీస్ కమిషనర్ కార్యాలయంలో హైదరాబాద్ సీపీ కార్యాలయంలో జరిగిన ఆత్మాహుతి దాడిలో ఓ హోంగార్డు మరణించాడు. ఈ ఘటనలో జాహెద్ ఆత్మాహుతి బాంబర్‌కు ఆశ్రయం కల్పించాడు. ఈ కేసులో జాహీద్ 12 ఏళ్ల పాటు జైలు జీవితం గడిపాడు. ఈ కేసు నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా జాహీద్ ఉగ్రవాదులతో సంబంధాలు ఏర్పరుచుకున్నట్లు పోలీసులు గుర్తించారు. దీంతో జాహీద్ పై పోలీసులు నిఘా పెంచారు. హైదరాబాద్ పేలుళ్లకు పోలీసులే కుట్ర పన్నారని తెలుసుకున్న పోలీసులు జాహీద్ ను అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం బయటపడింది.
Delhi liquor scam: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు.. దూకుడు పెంచిన ఈడీ
తాజావార్తలు
-
Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
-
GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
-
Off The Record : ఏలూరు నియోజకవర్గంలో జంపింగ్ జపాంగ్ కు కష్టాలు
-
Off The Record: కేతిరెడ్డికి ప్రాణహాని ఉందా? ట్రాప్ వెనుక ఎవరు?
-
Off The Record: ఇప్పుడు ఎమ్మెల్సీ.. తర్వాత అసెంబ్లీ? బీఆర్ఎస్-లెఫ్ట్ కెమిస్ట్రీ కుదిరేనా..?
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!