ఇండియాలోనే అతిపెద్ద ఫ్రీ పబ్లిక్ వైఫై నెట్వర్క్ గా హైదరాబాద్ ఉంది. లార్జెస్ట్ పబ్లిక్ ఇంటర్నెట్ కనెక్టెడ్ సిటీగా హైదరాబాద్ మొదటి స్థానంలో ఉంది. హై ఫై ప్రోగ్రాంలో భాగంగా ఆక్ట్ ఫైబర్ నెట్ భాగస్వామ్యంతో హైదరాబాద్లో ఫ్రీ వైఫై హాట్ స్పాట్స్ ఏర్పాటు చేసింది ప్రభుత్వం. హై ఫై ప్రోగ్రాం కామెమోరేషన్ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్, IT ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్, ఆక్ట్ ఫైబర్ నెట్ సీఈఓ బాల మల్లాది, GHMC మేయర్ విజయలక్ష్మి పాల్గొన్నారు. హైదరాబాద్లో మూడువేల పబ్లిక్ వైఫై హాట్ స్పాట్స్ ఏర్పాటు చేసి ఫ్రీ ఇంటర్నెట్ ఇస్తుంది ప్రభుత్వం.. సిటీలోని మాల్స్, లైబ్రరీస్, హాస్పిటల్స్, పబ్లిక్ పార్క్స్, మెట్రో స్టేషన్స్, విద్యాసంస్థలున్న పప్రాంతాల్లో ఫ్రీ వైఫై అందిస్తుంది.